మోడీ హయాంలోనే అవినీతి కంపు

అవినీతిరహిత భారతే లక్ష్యమంటూ అధికారం చేపట్టారు. అవినీతిపై యుద్ధం, అవినీతిరహిత భారతే లక్ష్యమంటూ నాలుగేళ్ల...
అవినీతిరహిత భారతే లక్ష్యమంటూ అధికారం చేపట్టారు. అవినీతిపై యుద్ధం, అవినీతిరహిత భారతే లక్ష్యమంటూ నాలుగేళ్ల క్రితం కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన బీజేపీ అవినీతిపై యుద్ధం, అవినీతిరహిత భారతే లక్ష్యమంటూ నాలుగేళ్ల క్రితం కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన బీజేపీ అవినీతిపై యుద్ధం, అవినీతిరహిత భారతే లక్ష్యమంటూ నాలుగేళ్ల క్రితం కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన బీజేపీ...
అవినీతిపై యుద్ధం అన్నారు అవినీతిరహిత భారతే లక్ష్యమన్నారు కాంగ్రెస్ పాలకులు దేశాన్ని అవినీతి భారత్‌గా మార్చేశారన్నారు తమకు అధికారం అప్పగిస్తే అవినీతిపై తిరుగులేని యుద్ధం ప్రకటిస్తామన్నారు కానీ మోడీ హయాంలోనూ అవినీతి కంపే మిగిలింది గతంతో పోలిస్తే భారత్ ర్యాంకులు మరింత దిగజారి మోడీ పాలనను వెక్కిరిస్తున్నాయి అవినీతిపై తిరుగులేని యుద్ధమంటూ మోడీ గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ అవినీతి నిరోధంలో మాత్రం భారత పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి చర్యలు చేపట్టినా అవినీతి తల రాతను మార్చలేకపోయాయి అవినీతి నిరోధంపై ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ ప్రకటించిన ర్యాంకుల్లో భారత్ దారుణంగా 81వ స్థానంలో నిలిచింది. అంతేకాదు 2016తో పోలిస్తే 2 ర్యాంకులు దిగజారింది. స్కోరు కార్డులో వందకి కేవలం 40 మార్కులే దక్కాయి.
ప్రపంచవ్యాప్తంగా 180 దేశాలకు ర్యాంకులు ఇచ్చారు. సున్నా మార్కులు వస్తే అత్యంత అవినీతి దేశంగా పరిగణిస్తారు. కనీసం 50 మార్కులు కూడా రాని దేశాలను అవినీతిమయమైన దేశాలుగా పరిగణిస్తున్నారు. అన్ని దేశాల సగటు 43 మార్కులు కాగా, భారత్‌కు 40 మార్కులే వచ్చాయి. సగటు మార్కుల కన్నా తక్కువ వచ్చినవి అత్యంత అవినీతిమయమైన దేశాలుగా పరిగణిస్తున్నారు. ఇంకా అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన జర్నలిస్టులు, అధికారులను బెదిరించడం, చంపడంలాంటివి భారత్‌లో ఎక్కువగా ఉందని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ పేర్కొంది. అంతేకాదు భారత్‌లో అవినీతికి ఎదురొడ్డి నిలిస్తే ప్రాణాలకు ముప్పు ఉందని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ ప్రకటించింది.
పోలీస్‌శాఖ, న్యాయవ్యవస్థ, దర్యాప్తు సంస్థల్లో అవినీతి తీవ్రస్థాయిలో ఉందని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ ప్రకటించింది. పోలీస్‌స్టేషన్లు, కోర్టుల్లో 62శాతం ఉంటే భూలావాదేవీల్లో 38శాతం ఉందని తెలిపింది. ఇక లారీలు, ఆటోవాలాలు, ట్యాక్సీలు చెల్లించే లంచాలు 61శాతంగా ఉన్నాయని ప్రకటించింది. ఇక అవినీతి కేసుల్లో ఇరుక్కున్న ఎంపీలు 31శాతం ఉంటే అవినీతికి పాల్పడుతున్న నేతలు 78శాతంగా పేర్కొంది. ఇక పేదలకు అందాల్సిన ఆహార వస్తువుల్లో 40శాతం అవినీతి జరుగుతోందన్నారు. ఇలా 11 రకాల సేవల్లో ఏటా జరుగుతోన్న అవినీతి వాటా దాదాపు 32లక్షల కోట్లగా ఉందని అంచనా వేసింది.
నిరుద్యోగమే అవినీతిని పెంచుతోందని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ సర్వేలో తేలింది. ఉద్యోగం కోసం లంచం ఇస్తున్నవారి సంఖ్య 45శాతం ఉన్నారని తెలిపింది. అయితే గట్టి శిక్షలు లేకపోవడం టేకిట్ ఈజీ పాలసీ వల్లే అవినీతి ఎక్కువవుతున్నాయంది. సమాచార హక్కు చట్టం వచ్చినా అవకతవకలను నిరోధించలేకపోతోందని ఇంటర్నేషనల్ సంస్థ సర్వేలో తేలింది. మొత్తానికి అవినీతిరహిత భారతే తమ లక్ష్యమంటూ మోడీ అధికారం చేపట్టి నాలుగేళ్లవుతున్నా అవినీతి కంపు మాత్రం వదలడం లేదు.
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
ముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం
19 Aug 2022 4:15 PM GMTBanana Problems: అరటిపండు అతిగా తింటే వచ్చే సమస్యలు ఇవే..!
19 Aug 2022 4:00 PM GMTకన్నీటి పర్యంతమైన 'గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ'.. డిప్యూటీ సీఎం సాయం..
19 Aug 2022 3:45 PM GMTసుకన్య సమృద్ధియోజన, పీపీఎఫ్, కిసాన్ వికాస్ పత్ర వడ్డీరేట్లు పెరిగే...
19 Aug 2022 3:30 PM GMTPM Modi: దేశంలో 10 కోట్ల ఇళ్లకు తాగునీరు..
19 Aug 2022 3:15 PM GMT