తడబడ్డా నిలబడ్డారు
ఈడెన్ గార్డెన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మొదటి t20 లో టీమిండియా జట్టు విజయం సాధించింది. విండీస్ విధించిన 110 పరుగుల లక్షాన్ని భారత్ 17.5 ఓవర్లలో సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దాంతో తొలుత బ్యాటింగ్ దిగిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి 109 పరుగులు చేసింది. 110 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు రోహిత్(6), ధావన్(3) వెనువెంటనే అవుట్ అయ్యారు. ఓ దశలో భారత్ విజయానికి ఎదురీదింది. కానీ తడబడ్డా నిలబడ్డారు. దినేశ్ కార్తీక్ నిలకడగా ఆడటం, చివర్లో కృనాల్ పాండ్యా విండీస్ బౌలర్లపై విరుచుకుపడటంతో భారత్ 17.5 ఓవర్లలోనే విజయం సాధించింది. కాగా విండీస్ బౌలర్లలో థామస్, బ్రాత్‌వైట్‌లు చెరో రెండు వికెట్లు తీయగా, పియరీకి ఒక వికెట్ దక్కింది.
Next Story




