నిలకడగా ఆడుతున్న భారత్..

nanireddy
Updated on: 24 Dec 2018 3:49 PM IST
నిలకడగా ఆడుతున్న భారత్..
X

వెస్టిండీస్ తో జరుగుతున్న మొదటి t20 మ్యాచ్ లో చివరి రెండు ఓవర్లలో విండీస్‌ ఆటగాళ్లు ధాటిగా ఆడటంతో విండీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. చివరి రెండు ఓవర్లలో విండీస్‌ 22 పరుగులు చేసింది. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ 3 వికెట్లు తీయగా, ఉమేశ్‌ యాదవ్‌, ఖలీల్‌ అహ్మద్‌, బుమ్రా, కృనాల్‌ పాండ్యాలకు ఒక్కో వికెట్‌ దక్కింది. విండీస్‌ భారత్‌కు 110 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. 110 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. తొలి ఓవర్‌లోనే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వికెట్‌ కోల్పోయింది. ఆ వెంటనే శిఖర్ ధావన్ అవుట్ అయ్యాడు. 6 బంతుల్లో 6 పరుగులు చేసిన రోహిత్‌, 8 బంతుల్లో 3 పరుగులు చేసిన ధావన్ ఒషేన్‌ థామస్ బౌలింగ్‌లో ఔటయ్యారు. ప్రస్తుతం భారత్ స్కోర్ నాలుగు వికెట్ల నష్టానికి 80 పరుగులు.. 14 ఓవర్లు పూర్తి అయ్యాయి. క్రీజులో పాండీ, కార్తీక్ ఉన్నారు. ఓషన్ థామస్ రెండు వికెట్లు పడగొట్టాడు.

nanireddy

nanireddy

Next Story