కోహ్లీ ఒంటరి పోరాటం వృధా..

nanireddy
Updated on: 24 Dec 2018 3:41 PM IST
కోహ్లీ ఒంటరి పోరాటం వృధా..
X

వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్‌ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(107: 119 బంతుల్లో 10 ఫోర్లు,1 సిక్స్‌) ఒంటరి పోరాటం చేయగా.. అతడు మినహాఇతర ఆటగాళ్ల సహకారం లేకపోవడంతో భారత్‌కు పరాజయం తప్పలేదు. విండీస్‌ బౌలర్లు మార్లోన్‌ శామ్యూల్స్‌ మూడు , హోల్డర్‌, మెక్‌కాయ్‌, అశ్లేనర్స్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టడంతో భారత్‌ 240 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో విండీస్‌ 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బ్యాట్స్‌మేన్స్ రోహిత్‌(8), ధావన్‌ (35), రాయుడు (22), పంత్‌ (24), ధోని(7)లు విఫలమయ్యారు. ముందుగా బ్యాటింగ్‌ కు దిగిన విండీస్‌ జట్టుకు బ్యాట్స్‌మన్‌ షై హోప్‌ (95), అశ్లే నర్స్‌ (40), హెట్‌మైర్‌ (37), హోల్డర్‌(32)లు రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్లు నష్టపోయి 283 పరుగులు చేసింది. ఈ లక్ష్య చేధనలో భారత్‌ చతికిల పడింది.

nanireddy

nanireddy

Next Story