భారత్-ఆసీస్ టెస్టు.. వర్షం కారణంగా నిలిచిపోయిన ఆట..

nanireddy
Updated on: 24 Dec 2018 4:28 PM IST
భారత్-ఆసీస్ టెస్టు.. వర్షం కారణంగా నిలిచిపోయిన ఆట..
X

నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా అడిలైడ్ ఓవల్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టుకు వర్షం రూపంలో ఆటంకం కలిగింది. ఓవర్‌నైట్ స్కోరు 191/7తో రెండో రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా.. త్వరగానే ఆసీస్ కీలక వికెట్ ను కోల్పోయింది. 15 పరుగులతో స్టార్క్‌ వెనుదిరిగాడు. బూమ్రా మ్యాజిక్ చేసి స్టార్క్‌ ను పెవిలియన్ కు చేర్చాడు. ఈ క్రమంలో వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపేశారు. ప్రస్తుతం ఆసీస్ స్కోర్ 8వికెట్ల నష్టానికి 204 పరుగులు, 91.4 ఓవర్లు, హెడ్ 66 పరుగులతో రాణిస్తూ క్రీజులో ఉన్నారు. కాగా భారత్ మొదటి ఇన్నింగ్స్ స్కోరుకు ఆస్ట్రేలియా 46 పరుగులు వెనుకబడి ఉంది.

nanireddy

nanireddy

Next Story