తేడా మొగుడు.. భార్య నగ్న ఫోటోలు తీసి..

x
Highlights

అనంతపురం జిల్లాలో మరో శాడిస్ట్ మొగుడి ఆరాచకం వెలుగులోకి వచ్చింది. పెళ్లయిన నాటి నుంచే భార్యను చిత్రహింసలు పెడుతున్నాడు. తన లోపాన్ని కప్పి...

అనంతపురం జిల్లాలో మరో శాడిస్ట్ మొగుడి ఆరాచకం వెలుగులోకి వచ్చింది. పెళ్లయిన నాటి నుంచే భార్యను చిత్రహింసలు పెడుతున్నాడు. తన లోపాన్ని కప్పి పుచ్చుకునేందుకు భార్యకు టీబీ ఉందంటూ వేధించాడు. భర్తకు అత్త కూడా తోడు కావడంతో తట్టుకోలేక బాధితురాలు పోలీసులకు ఆశ్రయించింది.

భార్యలను చిత్రహింసలకు గురి చేస్తున్నారు కొంత మంది శాడిస్ట్ భర్తలు. తమ లోపాలను కప్పి పుచ్చుకునేందుకు వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యను వేధింపులకు గురి చేస్తున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంకు చెందిన బాధితురాలికి రాజేంద్రప్రసాద్‌తో ఏడాది క్రితం వివాహమైంది. పెళ్లి సమయంలో 45 లక్షల రూపాయలు కట్నంగా ఇచ్చారు. దీనికి అదనంగా మరో పది లక్షల రూపాయలు ఇచ్చారు.

పెళ్లయి 24 గంటలు గడవకముందే భార్యకు నరకం చూపించాడు రాజేంద్రప్రసాద్‌. ఫస్ట్‌నైట్‌ రోజే భార్య బెడ్రూంలో ఉన్న నగ్న ఫోటోలను తీశాడు. తర్వాత తాను సంసారానికి పనికి రానంటూ భార్యకు చెప్పి షాకిచ్చాడు. తన లోపాన్ని ఎవరికైనా చెబితే సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ శాడిస్ట్ రాజేంద్ర ప్రసాద్ వేధిస్తున్నాడని భార్య ఆరోపిస్తోంది‌. కొద్ది రోజుల పాటు భర్త చిత్రహింసలు భరించిన బాధితురాలు భర్త గురించి అత్తకు చెప్పింది. కొడుకు నపుసకత్వం బయట పడకుండా ఉండేందుకు తల్లీకొడుకులు ఇద్దరూ కలిసి టీబీ రోగం ఉందంటూ వేధిస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తోంది. అత్త, భర్త వేధింపులు అధికమవడంతో బాధితురాలు డాక్టర్‌ దగ్గర వెళ్లి టీబీ లేదంటూ రిపోర్టులు తీసుకెళ్లడంతో అత్తింటివారు పరారయ్యారు.

రెండో పెళ్లికి సిద్ధమయ్యాడన్న విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. నగ్న చిత్రాలు అడ్డం పెట్టుకొని విడాకులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్లాన్‌ ప్రకారం విడాకులు ఇచ్చేందుకు రెడీ అయ్యాడని బాధితురాలు వాపోతోంది. ఓ వైపు కూతురు జీవితం నాశనం అయిందన్న బాధలో తల్లిదండ్రులు ఉంటే రాజేంద్ర ప్రసాద్‌ బంధువులు దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితురాలి తండ్రి వాపోతున్నారు. రాజేంద్రప్రసాద్‌ బంధువులు వేధింపులు తట్టుకోలేక కర్నూలు జిల్లాలో తలదాచుకుంటున్నట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories