ఐసీఐసీఐ బంపర్‌ ఆఫర్‌

nanireddy
Updated on: 24 Dec 2018 4:35 PM IST
ఐసీఐసీఐ బంపర్‌ ఆఫర్‌
X

ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ.. తన సంస్థలో పనిచేసే బ్యాంక్‌ ఉదోగినులకు అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. భారతదేశంలో పనిచేసే మహిళా ఉద్యోగులకు ఉచిత బీమా క్యాష్‌ బ్యాక్‌, డిస్కౌంట్లు అలాగే అన్‌లిమిటెడ్‌ ఏటీఎం ట్రాన్సాక్షన్స్‌ లాంటి ఆఫర్లను అందిస్తోంది. ‘అడ్వాంటేజ్ ఉమన్ ఔరా సేవింగ్స్ అకౌంట్‌’ పేరుతో ఉద్యోగినులకు ప్రత్యేక ఖాతాను అందిస్తోంది. ఈ అకౌంట్‌ తీసుకున్న వారికి డెబిట్‌ కార్డ్‌ వాడకంపై నెలకు రూ.750 క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను ప్రకటించింది. లాకర్‌ చార్జీలపై 50 శాతం డిస్కౌంట్‌, గృహ రుణాల ప్రాసెసింగ్‌ ఫీజులో డిస్కౌంట్‌. ద్విచక్ర వాహనాలపై వంద శాతం రుణ మంజూరీ వంటి అనేక ఆఫర్లను ‘అడ్వాంటేజ్ ఉమన్ ఔరా సేవింగ్స్ అకౌంట్‌’ ఖాతా ద్వారా పొందవచ్చని ఐసీఐసీఐ బ్యాంకు వెల్లడించింది.

nanireddy

nanireddy

Next Story