ఐశ్వ‌ర్య నా కన్నతల్లి అంటూ వైజాగ్ యువ‌కుడి హ‌ల్‌చ‌ల్‌!

ఐశ్వ‌ర్య నా కన్నతల్లి అంటూ వైజాగ్ యువ‌కుడి హ‌ల్‌చ‌ల్‌!
x
Highlights

ప్ర‌పంచ సుంద‌రిగా ఎంపికైన నాటి నుంచి ఎప్పుడూ వార్త‌ల్లో ఉంటూనే వ‌చ్చింది అందాల తార ఐశ్వ‌ర్యారాయ్‌. ప‌లువురు బాలీవుడ్ హీరోలతో ప్రేమాయ‌ణం, అమితాబ్ ఇంటి...

ప్ర‌పంచ సుంద‌రిగా ఎంపికైన నాటి నుంచి ఎప్పుడూ వార్త‌ల్లో ఉంటూనే వ‌చ్చింది అందాల తార ఐశ్వ‌ర్యారాయ్‌. ప‌లువురు బాలీవుడ్ హీరోలతో ప్రేమాయ‌ణం, అమితాబ్ ఇంటి కోడ‌లు కావ‌డం ఇలా ఐష్ ఎప్పుడూ వార్త‌ల్లో వ్య‌క్తే. ప్ర‌స్తుతం ఆమె అభిషేక్ భార్య‌గా, ఓ బిడ్డ‌కు త‌ల్లిగా ప్రశాంతంగా ఉంది. తాజాగా త‌న‌కేం సంబంధం లేని ఓ విష‌యంలో ఐష్ హాట్ న్యూస్‌గా మారింది.

విశాఖ యువకుడిగా చెప్పుకుంటున్న ఓ 29 ఏళ్ల కుర్రాడు సంగీత్ కుమార్ ఐశ్వర్య తన తల్లి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించి ఓ వీడియో నెట్లో హల్ చల్ చేస్తోంది. సంగీత్ కుమార్ ఆ వీడియోలో ఏంచెప్పాడంటే.. 'నేను ఇన్‌విట్రో ఫర్టిలైజేషన్‌ (ఐవీఎఫ్‌) ద్వారా 1988లో లండన్లో జన్మించా. ఐశ్వర్య తల్లిదండ్రులు కృష్ణరాజ్‌ రాయ్‌, వ్రిందా రాయ్లు రెండేళ్లపాటూ నన్ను పెంచారు. నా తండ్రి అడివేలు రెడ్డి తర్వాత నన్ను విశాఖపట్నం తీసుకువచ్చాడు. అప్పటి నుంచి విశాఖలోనే ఉండాల్సి వచ్చింది. నా తల్లి నుంచి దూరమై ఇప్పటికి 27 ఏళ్లు అవుతోంది. ఇప్పుడు నా తల్లితో ఉండాలనుకుంటున్నా. ఐష్ నా తల్లి అని నిరూపంచడానికి నా దగ్గర ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవు. ఆ డాక్యుమెంట్లను నా కుటుంబ సభ్యులు నాశనం చేశారు' అంటూ వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా ఇప్పుడు ఐష్, అభిషేక్లు కలిసి ఉండటం లేదట. వారిద్దరూ సెపరేట్ అయ్యారంటూ మరో బాంబు పేల్చాడు. ఈ కుర్రాడి వ్యాఖ్యలను ఐష్ అభిషేక్లు వింటే ఎలా స్పందిస్తారో చూడాలి.

29-year-old vishaka youth alleges that Aishwarya Rai is his mother - Sakshi

Show Full Article
Print Article
Next Story
More Stories