జగన్ లాలూచీ కేసుల మాఫీ కోసమే

జగన్ లాలూచీ కేసుల మాఫీ కోసమే
x
Highlights

బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్‌ను ప్రకటిస్తారని మిత్రపక్షమైన టీడీపీకి తెలియక ముందే వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి వెళ్లి పోటో...

బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్‌ను ప్రకటిస్తారని మిత్రపక్షమైన టీడీపీకి తెలియక ముందే వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి వెళ్లి పోటో ఎలా దిగారు? అని సీఎం చంద్రబాబు సమన్వయ కమిటీ సమావేశంలో నేతలతో అన్నారు. "కేంద్రం అడగకుండానే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు వైఎస్ జగన్ మద్దతిచ్చాడు?. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?. మనం ఏం చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసమే కానీ జగన్ చేసేదీ మాత్రం కేసుల మాఫీ, లాలూచీ కోసమే. నేనేదో కేసులకు భయపడుతున్నానని కొందరు ప్రచారం చేస్తున్నారు. కేసులకు నేను భయపడతానా? కేసులంటే మనకెందుకు భయం?. కాంగ్రెస్ పాలిత సీఎంలూ ఉన్నారు, అందరూ కేసులకు భయపడుతున్నారా?. రాజధానిలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని కేసులు పెట్టారు.. చివరికి ఏం జరిగింది. మనపై ఎన్నికేసులు పెట్టినా అన్నిటీకి క్లీన్‌చీట్ వచ్చింది" అని ఈ సందర్భంగా నేతలకు చంద్రబాబు వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories