వర్మ ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు

వర్మ ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
x
Highlights

సీసీఎస్‌లో రాంగోపాల్ వర్మ విచారణ ముగిసింది. 3 గంటల 20 నిమిషాల పాటు వర్మను ప్రశ్నించారు. మొత్తం 24 ప్రశ్నలపై సీసీఎస్ పోలీసులు వివరణ కోరారు. 41...

సీసీఎస్‌లో రాంగోపాల్ వర్మ విచారణ ముగిసింది. 3 గంటల 20 నిమిషాల పాటు వర్మను ప్రశ్నించారు. మొత్తం 24 ప్రశ్నలపై సీసీఎస్ పోలీసులు వివరణ కోరారు. 41 సీఆర్పీసీ కింద వర్మకు మరోసారి నోటీసులు జారీ చేశారు. సోమవారం హాజరుకావాలని ఆదేశించారు. రాంగోపాల్ వర్మ ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ స్వాధీనం కూడా సీసీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సామాజిక కార్యకర్త దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వర్మను విచారణకు పిలిచిన పోలీసులు ఈ రోజు సుమారు 4గంటలపాటు విచారించారు. అయితే, పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన వర్మ.. కాన్సెప్ట్‌ మాత్రమే తాను ఇచ్చానని, ఆ సినిమా తాను రిలీజ్ చేయలేదని, డైరెక్ట్‌ చేయలేదని చెప్పినట్టు డీసీపీ తెలిపారు. ఈ వ్యవహారంలో సాంకేతిక అంశాలు సేకరించినట్టు తెలిపారు. రామ్‌గోపాల్‌ వర్మ తీసిన ఈ చిత్రంపై ఓ టీవీ ఛానల్‌లో జరిగిన చర్చలో తనను దూషించారంటూ దేవి సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. వర్మ కేసు విచారణ నేపథ్యంలో సీసీఎస్‌ పోలీస్టేషన్‌ వద్ద పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories