Top
logo

మైనర్లకు వాహనమిచ్చిన యజమానికి శిక్ష‌ఖాయం

మైనర్లకు వాహనమిచ్చిన యజమానికి శిక్ష‌ఖాయం
X
Highlights

మైనర్లు వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే తప్పెవరిది? మైనర్ దా? బండి ఇచ్చిన యజమానిదా? ప్రమాదం చేయకపోయినా...

మైనర్లు వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే తప్పెవరిది? మైనర్ దా? బండి ఇచ్చిన యజమానిదా? ప్రమాదం చేయకపోయినా మైనర్లు వాహనం నడపడం తప్పుకదా? దీనికి శిక్ష లేదా? ఉంటే అది ఎవరికి? హైదరాబాదులో ఇటీవల జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మైనర్లు మృత్యువాతపడటంతో ఈ అంశంపై దృష్టి సారించిన పోలీసులు ఎంవీ యాక్ట్ లోని 180 సెక్షన్ కు పదును పెడుతున్నారు. ఇన్నాళ్లూ ఆ సెక్షన్ ను అంత పక్కాగా అమలు చేయని పోలీసులు ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ లు కూడా నిర్వహిస్తున్నారు.

వాహనాలు నడుపుతున్న మైనర్లు తాము ప్రమాదంలో పడటం, ఎదుటివారిని ప్రమాదానికి గురిచేయడం లేదా ఒక్కోసారి ఇద్దరూ ప్రమాదంలో పడటం జరుగుతోంది. రేసింగులు కూడా తీవ్ర ప్రమాదాలకు కారణమవుతున్నాయి. భారత మోటారు వాహనాల చట్టం ప్రకారం 16 ఏళ్లలోపు ఎలాంటి వాహనాలూ నడపకూడదు. 16 ఏళ్లు నిండితే గేర్లు లేని వాహనాలు నడపుకోవచ్చు. 18 ఏళ్లు నిండిన తర్వాతే ఆర్టీఏ అధికారులు లైసెన్సు మంజూరు చేస్తారు. ఈ లెక్కన ఎంవీ యాక్ట్ లోని 180వ సెక్షన్ ప్రకారం మైనర్లకు వాహనమిచ్చిన యజమానీ శిక్షార్హుడే.

గతంలో మైనర్లు వాహనం నడిపితే అత్యంత అరుదుగా అదీ వాహనం నడిపే వ్యక్తిపై చార్జ్ షీటు దాఖలు చేసేవారు. కానీ ఇటీవల జరిగిన ప్రమాదాలతో అప్రమత్తమైన పోలీసులు స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నారు. వాహనం నడుపుతూ దొరికిన మైనర్లతోపాటు యజమానికీ జరిమానా విధిస్తున్నారు. చాలామందిపై చార్జ్ షీట్స్ దాఖలు చేయగా న్యాయస్థానాలు నలుగురు యజమానులకు జైలుశిక్ష కూడా విధించాయి.

Next Story