భర్తకు నిద్రమాత్రలిచ్చి ప్రియుడితో ఎంజాయ్: భార్యకు షాకిచ్చిన మొగుడు

భర్తకు నిద్రమాత్రలిచ్చి ప్రియుడితో ఎంజాయ్: భార్యకు షాకిచ్చిన మొగుడు
x
Highlights

ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. కొంత కాలం బాగానే ఉన్నారు. అయితే వివాహేతర సంబంధం భార్య,భర్తల మధ్య చిచ్చు రేపింది. ఈ విషయమై తరచూ గొడవలకు దిగేవారు....

ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. కొంత కాలం బాగానే ఉన్నారు. అయితే వివాహేతర సంబంధం భార్య,భర్తల మధ్య చిచ్చు రేపింది. ఈ విషయమై తరచూ గొడవలకు దిగేవారు. అయితే ఈ విషయమై పెద్దలు రాజీ కుదిర్చారు. నిద్రమాత్రలిచ్చి మరో వ్యక్తితో తన భార్య రాసలీలలకు పాల్పడుతోందనే నెపంతో రాంబాబు అనే వ్యక్తి తన భార్యను రోకలిబండతో కొట్టి చంపాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకొంది.ఏలూరు పత్తేబాద రాఘవాచారి వీధిలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న తాళ్లూరి రాంబాబు, నాగలక్ష్మి దంపతులకు తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరూ ప్రే మించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. వీరిది లింగపాలెం మండలం పుప్పాలవారిగూడెం. వారికి నిఖిత, భవిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాంబాబు నగరంలోని ఓ హోటల్‌లో, నాగలక్ష్మి ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతుండటంతో ఏడాది క్రితం టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా పెట్టుకున్నారు.

పెద్దలు రాజీ చేయడంతో కలిసి ఉంటున్నారు. కొద్దిరోజులుగా పిల్లలను రాంబాబు తన తల్లి వద్ద ఉంచాడు. ఈ నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి నాగలక్ష్మికి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని తెలియడంతో భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. విచక్షణ కోల్పోయిన రాంబాబు రోకలి బండతో తలపై మోది నాగలక్ష్మిని హతమార్చాడు. మంగళవారం నాడు మధ్యాహ్నం పోలీసులకు లొంగిపోయాడు. కొంతకాలంగా తన భార్య తనకు నిద్రమాత్రలు ఇస్తోందని నిందితుడు ఆరోపిస్తున్నాడు.ఈ మాత్రలు వేసుకొన్న తర్వాత తాను నిద్రలోకి జారుకోగానే మరో వ్యక్తితో తనభార్య వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోందని రాంబాబు పోలీసులకు చెప్పినట్టు సమాచారం. సోమవారం నాడు కూడ తాను ఈ మాత్రలను వేసుకొన్నట్టు నమ్మించి పడుకొన్నానని చెప్పాడు.
అయితే తాను నిద్ర నుండి లేవగానే మరో వ్యక్తితో తన భార్య ఉందని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో తాను ఆగ్రహం పట్టలేక రోకలిబండతో కొట్టిచంపినట్టు సమాచారం. ఈ విషయమై ఘటనపై విచారణ చేపడుతున్నట్టు జిల్లా అదనపు ఎస్పీ కె. ఈశ్వరరావు ప్రకటించారు. ఈ హత్య ఘటనలో రాంబాబుతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయమై కూడ దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories