శాడిస్ట్ మొగుడు..భార్య పేరిట నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు తెరిచి పైశాచికం

x
Highlights

భార్య పేరిట నకిలీ ఫేస్ బుక్ ఖాతా సృష్టించి అశ్లీల సందేశాలను పంపిస్తున్న శాడిస్ట్ భర్తను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. అదుపులోకి...

భార్య పేరిట నకిలీ ఫేస్ బుక్ ఖాతా సృష్టించి అశ్లీల సందేశాలను పంపిస్తున్న శాడిస్ట్ భర్తను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకోవడానికి వచ్చిన పోలీసులను చూసి గుండెనొప్పి వచ్చింది నాటకం ఆడాడు. బ్యాంకు స్ట్రాంగ్ రూములో దాక్కుని హై డ్రామా సృష‌్టించాడు.

శ్రీకాకుళంలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్‌ మేనేజర్‌ శాంతి సృజన్‌ కు ఇటీవల హైదరాబాద్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో పని చేస్తున్న యువతితో వివాహం జరిగింది. ఆమెకు శ్రీకాకుళానికి బదిలీ కాకపోవడంతో ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్ లోనే ఉంది. భార్య పేరిట నకిలీ ఫేస్ బుక్ ఖాతాలను సృష్టించి నాతో స్నేహం చేయండి. రాత్రి పూట మీతో మాట్లాడుతుంటే సంతోషంగా ఉంటుంది" అని పోస్టులు పెడుతున్నాడు. దీంతో ఆ యువతికి అపరిచితుల నుంచి ఫోన్ కాల్స్ రావడం మొదలైంది. తన భర్తే దీనికి కారకుడన్న ఆమె అనుమానించింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకూ ఫిర్యాదు చేసింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు విచారణ చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు ఐపీ అడ్రస్ ల ఆధారంగా ఇదంతా సృజన్ నిర్వాకమేనని తేల్చారు. శ్రీకాకుళంలో ప్రగతి గ్రామీణ బ్యాంకులో సృజన్ ను పోలీసులు అరెస్ట్ చేసేందుకు రాగా బ్యాంకు స్ట్రాంగ్ రూములో దాక్కున్నాడు సృజన్. తనకు గుండెనొప్పి వస్తోందని చెప్పాడు. సృజన్ దొంగ నాటకం కనిపెట్టిన పోలీసులు తాము వెళ్లిపోతున్నామని చెప్పి, పక్కలో మకాం వేశారు. అరగంట తర్వాత స్ట్రాంగ్ రూమ్ నుంచి బయటకు వచ్చిన సృజన్ అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకువచ్చారు. భర్త పైశాచిక ప్రవర్తనపై విరక్తి చెందిన భార్య విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories