భార్యను రెడ్‌హ్యాండెడ్‌గాపట్టుకున్న భర్త...కేసు నమోదు

భార్యను రెడ్‌హ్యాండెడ్‌గాపట్టుకున్న భర్త...కేసు నమోదు
x
Highlights

ప్రేమించుకున్నారు.. పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు.. హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. వీరి దాంపత్య జీవితానికి ముగ్గురు పిల్లలు. యూసుఫ్‌గూడ...

ప్రేమించుకున్నారు.. పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు.. హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. వీరి దాంపత్య జీవితానికి ముగ్గురు పిల్లలు. యూసుఫ్‌గూడ సమీపంలోని జవహర్‌నగర్‌లో ఈ కుటుంబం నివాసం ఉంటోంది. భర్త డ్రైవర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండే వాడు. భార్య ఇంటి వద్దే ఉండి పిల్లల బాగోగులు చూసుకునేది. అయితే యువతికి ఇంటి పక్కనే ఉన్న భీమయ్య అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలుసుకున్న భర్త పలుమార్లు హెచ్చరించాడు. అయితే భర్త మాటలను భార్య లెక్కచేయనేలేదు.. నేను చేసేది.. చేసేదే అన్నట్లుగా ఆమె విర్రవీగి ప్రవర్తించింది. అయితే తీవ్ర ఆగ్రహానికి లోనైన భర్త ఒక రోజు గట్టిగా నిలదీశాడు అయినా ఆమె మాత్రం అక్రమ బంధానికి పుల్ స్టాప్ పెట్టలేదు. రెండురోజుల క్రితం డ్యూటీకి వెళ్లి రాత్రికి రానని భర్త చెప్పడంతో.... తన ప్రియుడు భీమయ్యను ఇంటికి పిలిపించుకుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి చేరుకున్న భర్త గదిలోకి చూడగా ఇద్దరు కనిపించారు. ఈ విషయంపై స్థానికులకు సమాచారం ఇవ్వడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బాధితుడి ఫిర్యాదుతో భీమయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories