కాలిబుడిదైన 1600 కార్లు

కాలిబుడిదైన 1600 కార్లు
x
Highlights

పార్కింగ్ చేసిన 1600 కార్లు బుడిద‌య్యాయి. దీంతో వాహ‌న‌దారులు ల‌బోదిబో మంటూ పోలీసుల్ని ఆశ్ర‌యిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు...

పార్కింగ్ చేసిన 1600 కార్లు బుడిద‌య్యాయి. దీంతో వాహ‌న‌దారులు ల‌బోదిబో మంటూ పోలీసుల్ని ఆశ్ర‌యిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు జ‌రుగుతున్నాయి. అయితే బ్రిట‌న్ ఎకో ఎరినా స‌మీపంలో న్యూఇయ‌ర్ సంద‌ర్భంగా నేష‌న‌ల్ హార్స్ షోను నిర్వ‌హించారు. ఆ షోకు హాజ‌రైన ఔత్సాహికులు త‌మ‌కార్ల‌ను పార్కింగ్ లాట్ లో పార్క్ చేశారు. అయితే షో జ‌రిగే స‌మ‌యంలో ఒక్క‌సారి పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగాయి. దీంతో నిర్వాహ‌కులు షో ను నిలిపివేసి , గుర్రాల్ని భ‌య‌ట‌కు పంపారు.

మంట‌లు చెలరేగిన ప్రాంతంలో అక్క‌డ‌ ఏం జ‌రిగిందో అని తెలుసుకోనేలోపు పార్క్ చేసిన కార్ల‌ని అగ్నికి ఆహుత‌య్యాయి. బాధితుల స‌మాచారంతో అగ్నిమాప‌క సిబ్బంది ఫైర్ ఇంజిన్ల‌తో మంట‌ల్ని ఆర్పే ప్ర‌య‌త్నం చేసింది. అయినా లాభంలేక‌పోయింది. పార్కింగ్ చేసిన కార్ల‌న్ని మంట‌ల్లో కాలిపోయాయి. ఇదిలా ఉంటే షోకు హాజ‌రై పార్కు చేసిన ఓ కారులో మంట‌లు చెల‌రేగి ఇత‌ర కార్ల‌కు వ్యాపించ‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు అధికారులు గుర్తించారు. కారు ఓనర్లు అందరూ తమ ఇన్సూరెన్స్ కంపెనీలను సంప్రదించాలని కూడా పోలీసులు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories