చంద్రగ్రహణం.. ఏపీలో నరబలికి యత్నం..

చంద్రగ్రహణం.. ఏపీలో నరబలికి యత్నం..
x
Highlights

ఖగోళ అద్భుతాన్ని ప్రపంచం వీక్షిస్తుంటే కృష్ణా జిల్లాలో మాత్రం మంత్రగాళ్లు రెచ్చిపోయారు. అతీత శక్తుల వస్తాయంటూ కొందరు వ్యక్తులు నరబలి ఇచ్చేందుకు...

ఖగోళ అద్భుతాన్ని ప్రపంచం వీక్షిస్తుంటే కృష్ణా జిల్లాలో మాత్రం మంత్రగాళ్లు రెచ్చిపోయారు. అతీత శక్తుల వస్తాయంటూ కొందరు వ్యక్తులు నరబలి ఇచ్చేందుకు సిద్దమయ్యారు. మాయమాటలతో ఓ యువకుడిని నరబలి ఇచ్చేందుకు ప్రయత్నించారు.

సంపూర్ణ చంద్ర గ్రహణం రోజున కృష్ణాజిల్లాలో క్షుద్రపూజల ఘటన తీవ్ర కలకలం రేపింది. నూజివీడు మండలం యనమదల కొందరు మంత్రగాళ్లు క్షుద్రపూజలకు సిద్ధమయ్యారు. వంద సంవత్సరాలకు ఓ సారి వచ్చే ఇలాంటి రోజున నరబడి ఇస్తే అతీత శక్తులు వస్తాయంటూ ఓ యువకుడిని బలిచ్చేందుకు గ్రామ పొలిమేర్లలోకి తీసుకొచ్చారు. పొలాల్లోకి వచ్చిన తరువాత పరిస్దితి తెలుసుకున్న యువకుడు చాకచక్యంగా మంత్రగాళ్ల నుంచి తప్పించుకున్నాడు.

గ్రామంలోకి వెళ్లి జరిగిన విషయాన్ని తెలియ జేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మంత్రగాళ్ల ఆచూకిపై ఆరా తీశారు. అప్పటికే మంత్రగాళ్లు పరారి కావడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories