logo

వడదెబ్బ నుంచి ఉప‌శ‌మ‌నం పొందాలంటే

వడదెబ్బ నుంచి ఉప‌శ‌మ‌నం పొందాలంటే

వేసవి కాలం ఎండల ధాటికి వడదెబ్బ ప్రభావం శరీరంపై పడే అవకాశం ఉంది. శరీరంలో నీటిశాతం తగ్గితే వడదెబ్బ తగులుతుంది. అందుచేత వేసవిలో శరీరంలో నీటిశాతం తగ్గకుండా చూసుకోవాలి. ఇంకా ఎండల్లో ఎక్కువ తిరకుండా ఉండాలి. అధికంగా ఎండలో తిరగటంతో శరీరం మీది రక్తకణాలు కుంచించుకుపోతాయి. అనంతరం ఈ ప్రభావం కిడ్నీలు, లివర్‌ దెబ్బతినడానికి దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వడదెబ్బకు గురైన వారిలో వేవిళ్లు, తలతిరగడం, జ్వరం రావడం చెమటలు రాకుండా, అధిక టెంపరేచర్‌తో పల్స్‌ పడిపోవటం, మతి కోల్పోవటం, కోమాలో పడిపోవటంవంటి లక్షణాలు కనబడతాయి. వీటి ద్వారా ఆకస్మిక మరణం కూడా సంభవించవచ్చు. వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే శరీరంలోని నీటి సమతుల్యతను కాపాడుకోవడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం చేయాలి.

అధికంగా ఎండలో తిరగడం ద్వారా మెదడులోని భాగం సమతుల్యతను కోల్పోతాం. తద్వారా అత్యధికంగా వడదెబ్బతో మరణాలు చోటుచేసుకుంటాయి. వడదెబ్బ తగిలిన వ్యక్తిని గుర్తించిన వెంటనే నీడలో సేదతీరేలా చేయాలి. బట్టలు వదులు చేసి నీళ్లతో తడపాలి, ఈ విధంగా చేయటంతో రక్తనాళాలు కుంచించుకుపోకుండా ఆపగలమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో శరీరంలోని నీటి శాతం పెంచేందుకు ఐవి ఫ్లూయిడ్స్‌ అందించాలని వారు చెప్తున్నారు.

ఎండలో బయటికి వెళ్లేవారు టోపీలు, స్కార్ఫ్‌లు వాడితే మంచిది. ప్రధానంగా మధ్యాహ్నం 12 గంటల నుండి ఐదు గంటల వరకు ఎండలో తిరగకపోవటం ఉత్తమం. ఒకవేళ వృత్తిలో తప్పనిసరి అయిన వారు కార్యాలయాలలో చల్లటి వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ప్రతి అర్ధగంటకు మూడు వందల మిల్లీలీటర్ల చొప్పున రోజుకు ఐదారు లీటర్లకు తగ్గకుండా నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వేసవి తాపాన్ని తట్టుకోవడం ఎలా? నిల్వ ఉన్న ఆహారాన్ని తీసుకుంటే అంతే...

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతలు పెరిగిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే పలువురు వడదెబ్బ తగిలి తీవ్ర అస్వస్థతకు లోనైనట్టు వార్తలు వస్తున్నాయి. ఇలాంటికాలంలో మరింత జాగ్రత్తతో ప్రతి ఒక్కరూ వ్యవహరించాలి. ఈ వేసవి తాపాన్ని తట్టుకునేందుకు వ్యక్తిగతంగా చిన్నపాటి చిట్కాలు పాటిస్తేచాలు..

వేసవికాలంలో ఎక్కువగా పగటి పూట తిరగకుండా ఉండటం మంచిది. ఒకవేళ విధిలేని పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే సన్‌స్క్రీన్, టోపి, సన్‌గ్లాసెస్, గొడుగులు వంటివి ఉపయోగించాలి.

వేసవికాలంలో తగినంత నిద్రపోవాలి. వేసవిలో నీళ్లు ఎంత ఎక్కువగా తాగితే అంత మంచిది. వీలైనంత ఎక్కువగా పండ్ల రసాలు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల నీరసం రాదు. అంతేగాకుండా శరీరంలోని నరాలు ఎముకలు బలంగా ఉంటాయి.

ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో కనీసం 20 నిమిషాలైనా వ్యాయామం లేదా వాకింగ్ చేయడం ఉత్తమం. తాజా ఆహారాన్నే తీసుకోవాలి. నిల్వ చేసిన ఆరోగ్యాన్ని తీసుకుంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

arun

arun

Our Contributor help bring you the latest article around you


లైవ్ టీవి

Share it
Top