వార్డు బాయ్‌‌ అరాచకం...మహిళా రోగిని స్కానింగ్‌కు తీసుకెళ్లి ..

వార్డు బాయ్‌‌ అరాచకం...మహిళా రోగిని స్కానింగ్‌కు తీసుకెళ్లి ..
x
Highlights

రోగికి వైద్యం చేయాల్సిన ఓ ప్రబుద్ధుడు... అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన విశాఖపట్నం కేజీహెచ్‌లో జరిగింది. స్కానింగ్‌ సెంటర్‌కు పరీక్షల నిమిత్తం వచ్చిన ఓ...

రోగికి వైద్యం చేయాల్సిన ఓ ప్రబుద్ధుడు... అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన విశాఖపట్నం కేజీహెచ్‌లో జరిగింది. స్కానింగ్‌ సెంటర్‌కు పరీక్షల నిమిత్తం వచ్చిన ఓ మహిళా రోగిపై... అసభ్యకరంగా తాకేందుకు ప్రయత్నం చేశాడు వార్డుబాయ్‌. స్కానింగ్‌ రూమ్‌లో ఎవరూ లేని సమయంలో దుశ్చర్యకు పాల్పపడ్డాడు. దీంతో బాధితురాలు జరిగిన విషయాన్ని తన భర్తకు తెలిపింది.

ఇదిలా ఉంటే... బాధితురాలి భర్త ఫిర్యాదుతో ఈ ఉదంతం వెలుగు చూసింది. ఈ విషయంపై వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేశారు బాధితులు. మరోవైపు కేజీహెచ్‌ యాజమాన్యం కూడా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. వార్డు బాయ్‌ను విధుల నుండి తొలగించింది. అయితే తనపై చర్యలు తీసుకున్నందుకు వార్డ్‌ బాయ్‌ కిరణ్‌ అనుచరులతో కలిసి స్కానింగ్‌ సెంటర్‌లో గొడవకు దిగాడు. ఈ దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డ్‌ అయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories