logo

హోంమంత్రి చినరాజప్పకు ఘోర అవమానం

హోంమంత్రి చినరాజప్పకు ఘోర అవమానం
Highlights

ఏపీ హోంమంత్రి చినరాజప్పకు ఘోర అవమానం జరిగింది. హోంశాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్య వైఖరి మరోసారి బయటపడింది....

ఏపీ హోంమంత్రి చినరాజప్పకు ఘోర అవమానం జరిగింది. హోంశాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్య వైఖరి మరోసారి బయటపడింది. పోలీస్‌ శాఖ కార్యక్రమానికి ఆ శాఖ మంత్రికే ఆహ్వానం అందలేదు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ప్రారంభోత్సంలో హోంమంత్రి చినరాజప్పను పోలీస్‌ ఉన్నతాధికారులు విస్మరించారు. కేవలం మంత్రి కార్యాలయానికి ఇన్విటేషన్‌ పంపి చేతులు దులుపుకున్నారు. పోలీస్‌ ఉన్నతాధికారుల తీరుపై నొచ్చుకున్న హోంమంత్రి చినరాజప్ప ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. చినరాజప్ప రాకపోవడంపై ఆరా తీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు విషయం తెలుసుకుని పోలీస్‌ ఉన్నతాధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.


లైవ్ టీవి


Share it
Top