హనుమాన్‌జంక్షన్‌లో చింతమనేని హల్‌చల్‌

హనుమాన్‌జంక్షన్‌లో చింతమనేని హల్‌చల్‌
x
Highlights

టీడీపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు. దాడి కేసులో రెండేళ్ల జైలుశిక్ష పడి, బెయిల్‌పై బయట తిరుగుతున్నా తన తీరు మాత్రం...

టీడీపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు. దాడి కేసులో రెండేళ్ల జైలుశిక్ష పడి, బెయిల్‌పై బయట తిరుగుతున్నా తన తీరు మాత్రం మార్చుకోవడం లేదు. ఎప్పటిలాగే సామాన్యులు, ప్రభుత్వ ఉద్యోగులపై దాడులకు తెగబడుతూనే ఉన్నాడు. తాజాగా హనుమాన్‌ జంక్షన్‌లో వీరంగమాడిన చింతమనేని ఆర్టీసీ సిబ్బందిని బండ బూతులు తిడుతూ కొట్టినంత పనిచేశాడు. ఇదేమిటని ప్రశ్నించిన స్థానికులపై చేయి చేసుకుని రెచ్చిపోయాడు.

బండ బూతులు తిట్టడం, దాడి చేయడం, కొట్టడం టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు పరిపాటిగా మారింది. మాజీ మంత్రిపై దాడి కేసులో రెండేళ్ల జైలుశిక్ష పడి, బెయిల్‌పై బయట తిరుగుతోన్న చింతమనేని తన తీరు మాత్రం మార్చుకోవడం లేదు. పైగా చింతమనేని బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. సామాన్యుడి నుంచి అధికారులు, పోలీసుల వరకు అందరూ చింతమనేని బాధితులు మారుతున్నారు. తాజాగా మరోసారి చింతమనేని రెచ్చిపోయారు. హనుమాన్‌ జంక్షన్‌‌లో ఆర్టీసీ సిబ్బందిని బండ బూతులు తిట్టారు.

నూజివీడు డిపో ఆర్టీసీ బస్సు హనుమాన్‌ జంక్షన్‌ నుంచి గుడివాడకు వెళ్తోంది. అయితే బస్సుపై అతికించిన ప్రభుత్వ పోస్టర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో చిరిగి ఉంది. ఇదే ఆర్టీసీ సిబ్బందికి శాపంగా మారింది. అదే సమయంలో అటుగా వచ్చిన చింతమనేని ప్రభాకర్‌ బస్సుపై చంద్రబాబు ఫొటో చిరిగి ఉండటాన్ని గమనించి తన అనుచరులతో బస్సును అడ్డగించారు. డ్రైవర్‌‌ను, కండక్టర్‌ను కిందికి దించి నడిరోడ్డుపైనే బండ బూతులు తిట్టాడు. ప్రభుత్వ సొమ్ము తింటూ ముఖ్యమంత్రి ఫొటో చిరిగినా పట్టించుకోరా అంటూ తిట్లపురాణం అందుకున్నారు. డిపోకి వెళ్లాక సరిచేయిస్తామని చెప్పినా వినలేదు. ప్రయాణికులను దించి మరో బస్సులో పంపాలని ఆదేశించారు. అయితే ఇదేమిటని ఓ స్థానికుడు ప్రశ్నించడంతో రెచ్చిపోయిన చింతమనేని అతనిపై చేయి చేసుకున్నాడు. చింతమనేని వీరంగంతో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.

చింతమనేని దాడి విషయం తెలుసుకున్న స్థానికులు హనుమాన్ జంక్షన్ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. చింతమనేనిపై కేసు నమోదుచేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాంతో హనుమాన్ జంక్షన్ సెంటర్లో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే పోలీసులు సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు చింతమనేనిపై కేసు నమోదు చేశారు. అయితే చింతమనేని తీరుపై ప్రజలు, ఉద్యోగులు, విపక్షాలే కాదు టీడీపీ నేతలు కూడా మండిపడుతున్నారు. చింతమనేని కంట్రోల్‌ చేయకపోతే టీడీపీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories