మహనటి మిస్సమ్మని మిస్ అవ్వకండి

మహనటి మిస్సమ్మని మిస్ అవ్వకండి
x
Highlights

అభినేత్రిగా సావిత్రికి మంచి పేరు తెచ్చే, మల్టీ స్టారర్ సినిమాగా ఎంతో కీర్తి వచ్చే, “మన్మొయీ గర్ల్స్ స్కూల్” కథ ఎంతో నచ్చే, అందుకే మిస్సమ్మగా...

అభినేత్రిగా సావిత్రికి మంచి పేరు తెచ్చే,

మల్టీ స్టారర్ సినిమాగా ఎంతో కీర్తి వచ్చే,

“మన్మొయీ గర్ల్స్ స్కూల్” కథ ఎంతో నచ్చే,

అందుకే మిస్సమ్మగా సావిత్రి మన ముందు కొచ్చే. శ్రీ.కో.


మిస్సమ్మ చిత్రం తెలుగు సినీ చరిత్రలో ఒక మహా చిత్రంగా నిలిచిపోయింది. మల్టీ స్టారర్ సినిమాల యొక్క గాలి నడుస్తున్న కాలం. నాగిరెడ్డి, చక్రపాణి, ఎల్వీప్రసాద్ వంటి మహానుభావుల ఆలోచన జరిలో సినిమాలు వర్ధిల్లిన ఆ రోజుల్లో వచ్చిన అద్భుత చిత్రం మిస్సమ్మ. ఇది ఒక అద్భుతమైన కడుపుబ్బా నవ్వించే హాస్య చిత్రం. ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమలోని అతి పెద్ద హీరోలుగా పేరు గాంచిన నందమూరి తారక రామారావు మరియు అక్కినేని నాగేశ్వరరావు నటించారు. ఘన విజయము సాదించిన ఈ చిత్రంలో ముఖ్యపాత్రను పోషించినది మాత్రము మహానటి సావిత్రి.
ఆమె పాత్రకు ఎంతో తోడుగా ఎస్వీ రంగారావు, జమున, రేలంగి వెంకటరామయ్య, ఋష్యేంద్రమణి, అల్లు రామలింగయ్య, రమణారెడ్డి, బాలక్రిష్ణ, దొరైస్వామి తదితరులు నటించారు. సావిత్రికి ఈ సినిమాతో చక్కని అభినేత్రిగా మంచి పేరు వచ్చింది. ఆమె ఇక చిత్ర పరిశ్రమలో తిరిగి చూడ లేదు. మిస్సమ్మ చిత్రము యొతిష్ బెనర్జీ అనే బెంగాలి రచయిత యొక్క “మన్మొయీ గర్ల్స్ స్కూల్” అనే హాస్య రచన ఆధారంగా చక్రపాణి మరియు పింగళి నాగేంద్రరావులు రచించగా ఎల్వీ ప్రసాదు దర్శకత్వంలో రూపొందిచబడినది.

Show Full Article
Print Article
Next Story
More Stories