దసరాకు విజయవాడ వెళ్తున్నారా..? అయితే వీళ్లతో జాగ్రత్త..!

దసరాకు విజయవాడ వెళ్తున్నారా..? అయితే వీళ్లతో జాగ్రత్త..!
x
Highlights

విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని దుర్గమ్మ దర్శనం చేసుకుందామని ఉత్సాహంగా వెళ్లే భక్తులకు దారి మధ్యలో ఎదురవుతున్న...

విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని దుర్గమ్మ దర్శనం చేసుకుందామని ఉత్సాహంగా వెళ్లే భక్తులకు దారి మధ్యలో ఎదురవుతున్న ఇబ్బందులు చికాకు తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా హిజ్రాలు ఎక్కడికక్కడ కాపుకాసి డబ్బుల కోసం భక్తుల్ని డిమాండ్‌ చేయడం, డబ్బులిచ్చే వరకు విడిచిపెట్టక పోవడంతో బెంబేలెత్తిపోతున్నారు. వీరి నుంచి బయటపడడానికి మహిళలు, యువకులు తీవ్రయాతన పడాల్సి వస్తోంది. రథం సెంటర్‌లో పలువురు హిజ్రాలు శుక్రవారం ఒక్కసారిగా హల్‌చల్‌ సృష్టించారు. దర్శనానికి వెళ్లి వచ్చిన భక్తుల నుంచి ఐదారు మంది హిజ్రాలు బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారు. డబ్బుల్లేవని పర్సులు చూపించినా మహిళలను సైతం వదల్లేదు. యువకులను కూడా ముందుకు కదలనీయకుండా అడ్డుకుని మరీ డబ్బు గుంజారు. తల మీద చేతులు వేయడం... చేతులు పట్టుకుని వెనక్కి లాగడం... భుజాలపై తాకడం... వంటి వీరి చేష్టలతో విసిగిపోయిన భక్తులు డబ్బులు సమర్పించుకుని బయటపడ్డారు. వీరి చేష్టలపై పోలీసులు దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories