పరిపూర్ణానందపై నగర బహిష్కరణ ఎత్తివేత!

పరిపూర్ణానందపై నగర బహిష్కరణ ఎత్తివేత!
x
Highlights

పరిపూర్ణానందస్వామికి హైకోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్ , రాచకొండ, సైబరాబాద్ కమిషనర్లు జారీ చేసిన ఉత్తర్వులపై కోర్టు స్టే విధించింది. నెలరోజుల క్రితం...

పరిపూర్ణానందస్వామికి హైకోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్ , రాచకొండ, సైబరాబాద్ కమిషనర్లు జారీ చేసిన ఉత్తర్వులపై కోర్టు స్టే విధించింది. నెలరోజుల క్రితం పరిపూర్ణానంద స్వామిపై నగర పోలీసులు బహిష్కరణ విధించారు. దీన్ని సవాల్ చేస్తూ ఆయనహైకోర్టు కు వెళ్లారు. ఆయనపై హైదరాబాద్ పోలీసులు విధించిన నగర బహిష్కరణపై స్టే విధిస్తున్నట్టు కొద్దిసేపటి క్రితం హైకోర్టు ప్రకటించింది. తనపై బహిష్కరణ వేటు సరికాదని, తన వ్యక్తిగత స్వేచ్ఛకు అది భంగం కలిగిస్తోందని ఆరోపిస్తూ, పరిపూర్ణానంద హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై వాదోపవాదాలు విన్న తరువాత, ఆయన ఎక్కడైనా తిరగవచ్చని చెబుతూ, తదుపరి ఆదేశాలు వెలువడే వరకూ బహిష్కరణ ఉత్తర్వులను నిలుపుదల చేస్తున్నట్టు పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories