కోళ్లకిచ్చినట్లు బాలికలకు హార్మోన్‌ ఇంజక్షన్లా ?

కోళ్లకిచ్చినట్లు బాలికలకు హార్మోన్‌ ఇంజక్షన్లా ?
x
Highlights

యాదాద్రికి మాయని మచ్చగా మిగిలిన వ్యభిచార గృహాల వ్యవహారాన్ని హైకోర్టు సిరియస్‌గా తీసుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రంలో అభం శుభం తెలియని చిన్నారులను...

యాదాద్రికి మాయని మచ్చగా మిగిలిన వ్యభిచార గృహాల వ్యవహారాన్ని హైకోర్టు సిరియస్‌గా తీసుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రంలో అభం శుభం తెలియని చిన్నారులను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టినతీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. బ్రాయిలర్‌ కోళ్లకు ఇచ్చినట్లు ఆడపిల్లలకు హార్మోన్‌ ఇంజెక్షన్లు ఇచ్చినా ఇంటెలిజెన్స్‌ ఏం చేస్తోందని మండిపడింది. 52 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ దందా జరుగుతున్నా మీకు తెలియలేదంటే అసలేం చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

చిన్నారులను వ్యభిచార వృత్తిలోకి దింపడమే తీవ్రమైన నేరమైతే వారు యుక్త వయస్కులుగా కనిపించేందుకు హార్మోన్ల ఇంజక్షన్లు ఇవ్వడం అమానుషమంది హైకోర్టు. మాంసం ఎక్కువగా వచ్చేందుకు బ్రాయిలర్‌ కోళ్లకు హార్మోన్‌ ఇంజక్షన్లు ఇచ్చినట్లు ఇక్కడ చిన్నారులకు ఇవ్వడానికి వాళ్లు ఆడపిల్లలా? లేక బ్రాయిలర్‌ కోళ్లా?’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. చిన్నారులను బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపడం ఓ మార్కెట్‌గా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేసింది. నరకకూపంలో మగ్గిన చిన్నారులు పడ్డ వర్ణనాతీత వేదనకు పరిహారం ఇస్తే సరిపోతుందా?’ అంటూ మండిపడింది.

హెచ్‌ఎంటీవీ వరుస కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసిన హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. సభ్య సమాజం సిగ్గుపడేరీతిలో పసిమొగ్గలను బలవంతంగా వ్యభిచారంలోకి దింపి వ్యాపారం చేస్తున్న ముఠాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో కోర్టుకు తెలుపాలని పోలీస్‌ శాఖకు సూచించింది. ఈ భారీ సెక్స్‌ కుంభకోణం వ్యవహారంలో నిర్వాహకులతో అధికారులు కుమ్మక్కయి ఉంటారని అనుమానం వ్యక్తం చేసిన హైకోర్టు కేసు పురోగతిపై వివరణ ఇచ్చేందుకు నేటీ విచారణకు యాదాద్రి డీసీపీ వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.

ఆడపిల్లలకు హార్మోన్‌ ఇంజక్షన్లు ఇస్తున్న వారిపై ఐపీసీ 120 (బీ )సెక్షన్‌ కింద కేసులు నమోదు చేశారా అని నిలదీసిన హైకోర్టు వ్యభిచార కూపం నుంచి దించకుండా ఎంత మంది విముక్తి కల్పించారో తెలపాలని ఆదేశించింది. యాదాద్రి ఘటనపై సిట్‌ ఏర్పాటు చేయడంపై వైఖరి తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం ఈ సిట్‌లో మహిళాధికారులకు తగిన ప్రాధాన్యత ఉండాలని తేల్చిచెప్పింది నరకకూపం నుంచి బయటపడిన బాధితులను రక్షించేందుకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఇటువంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా ఏం చేయాలనుకుంటున్నారో కూడా వివరించాలని ఆదేశాలు జారీచేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories