ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుపై హైకోర్టులో విచారణ

ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుపై హైకోర్టులో విచారణ
x
Highlights

కోమటిరెడ్డి, సంపత్ కుమార్‌ల శాసన సభ్యత్వ రద్దుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో కోర్టు ఆదేశాల మేరకు కౌంటర్ దా‌ఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం...

కోమటిరెడ్డి, సంపత్ కుమార్‌ల శాసన సభ్యత్వ రద్దుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో కోర్టు ఆదేశాల మేరకు కౌంటర్ దా‌ఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ, ప్రభుత్వం వేర్వేరంటూ పేర్కొంది. దీనిపై రిప్లై కౌంటర్ దాఖలు చేసిన కోమటిరెడ్డి, సంపత్ కుమార్‌ల సభ్యత్వ రద్దుపై సభలో ఒకలా, బయట మరోలా, కోర్టులో ఇంకోలా ప్రభుత్వం చెబుతోందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కోర్టుకు అడ్వకేట్ జనరల్ హామీ ఇచ్చినట్టుగానే శాసనసభలోని దృశ్యాలను అందివ్వాలంటూ విన్నవించారు. ఇప్పటికీ అడ్వకేట్ జనరల్ రాజీనామా ఆమోదం పొందలేదంటూ కోర్టు దృష్టి తీసుకొచ్చారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories