హీరోయిన్ల ఫోటోలు కాల్‌గాళ్స్‌ అంటూ పెట్టి..రేటు కార్డులు నిర్ణయించి...

హీరోయిన్ల ఫోటోలు కాల్‌గాళ్స్‌ అంటూ పెట్టి..రేటు కార్డులు నిర్ణయించి...
x
Highlights

కాల్‌గర్ల్స్‌ అంటూ హీరోయిన్ల ఫోటోలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశాడు. ఒక్కో హీరోయిన్‌కు...ఒక్కో రేటు ఫిక్స్‌ చేశాడు. వైబ్‌సైట్లలో ఫోటోలు చూసిన యువకులు...

కాల్‌గర్ల్స్‌ అంటూ హీరోయిన్ల ఫోటోలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశాడు. ఒక్కో హీరోయిన్‌కు...ఒక్కో రేటు ఫిక్స్‌ చేశాడు. వైబ్‌సైట్లలో ఫోటోలు చూసిన యువకులు గణేశ్‌కు డబ్బులు చెల్లించారు. డబ్బు అకౌంట్లో పడగానే గణేశ్‌ ఫోన్‌ను స్విచ్ఛాప్‌ చేసేవాడు. తన ఫోటో లోకాంటో వెబ్‌సైట్‌లో పెట్టి కాల్‌గర్ల్‌గా చిత్రీకరించిన గణేశ్‌పై సినీ నటి సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సీసీఎస్‌ పోలీసులు గణేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎస్కార్ట్ సర్వీసు పేరుతో మోసం చేసినట్లు గణేశ్‌ అంగీకరించాడు.

హైదరాబాద్ నగరానికి చెందిన గణేష్ డిగ్రీ చేశాడు. డిగ్రీ పూర్తయిన తర్వాత పలు ప్రముఖ ఇంటర్ కళాశాలల్లో లెక్చరరుగా పనిచేశాడు. ఇటీవల దిల్‌సుఖ్ నగర్‌లోని కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పని చేసి ఉద్యోగాన్ని మానేశారు. సులభంగా డబ్బు సంపాదించేందుకు ఎస్టార్టు సర్వీసు పేరిట యువకుల నుంచి డబ్బు వసూలు చేశాడు. వెబ్‌సైట్‌లో హీరోయిన్లు ఫోటోలు పెట్టి వారి పేరుతో రూ.40వేల నుంచి రూ.60 వేలంటూ రేట్ పెట్టాడు. ఎస్కార్టు సర్వీసు పేరిట యువకుల నుంచి డబ్బు వసూలు చేశాడు. యువకులు ఎస్కార్టు సర్వీసు కోసం డబ్బు ఖాతాకు బదిలీ చేయగానే మొబైల్ ఫోన్ స్విచాఫ్ చేసేవాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories