కేసీఆర్‌కు ఝలక్‌

కేసీఆర్‌కు ఝలక్‌
x
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఝలక్‌ తగిలింది. ముఖ్యమంత్రి కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని తెలిపిన విషయం తెలిసిందే. ఈ విషయంపై రెండు రోజుల క్రితమే...

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఝలక్‌ తగిలింది. ముఖ్యమంత్రి కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని తెలిపిన విషయం తెలిసిందే. ఈ విషయంపై రెండు రోజుల క్రితమే స్పందించిన జేఎంఎం నేత హేమంత్ సోరెన్.. థర్డ్‌ ఫ్రంట్ ఏర్పాటుపై కేసీఆర్‌తో తాను మాట్లాడానని, ఆయా రాష్ట్రాల్లో ఉన్న బలమైన నాయకులు కలిస్తే జాతీయ స్థాయిలోని పార్టీలను ఎదుర్కోవచ్చని అన్నారు. అయితే, ఆయన అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.

మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ‘ఈ విషయమై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో చర్చించాం. వచ్చే ఎన్నికల్లో జేఎంఎం నేతృత్వంలో పోరాడేందుకు రాహుల్‌ సుముఖత వ్యక్తం చేశారు’ అని తెలిపారు.

కాగా, థర్డ్‌ ఫ్రంట్‌ విషయంలో కేసీఆర్‌తో తాను మాట్లాడానని.. రాష్ట్రాల్లో ఉన్న బలమైన నాయకులు కలిస్తే జాతీయ స్థాయిలోని పార్టీలను ఎదుర్కోవచ్చని హేమంత్‌ సోరెన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసీఆర్‌పై పొగడ్తలు గుప్పించిన సోరెన్‌.. 48 గంటలు గడవకముందే కూటమిపై వెనక్కి తగ్గటం విశేషం.

<blockquote class="twitter-tweet" data-lang="en"><p lang="en" dir="ltr">Rahul Gandhi has given us his word that the upcoming Lok Sabha & Vidhan Sabha elections will be fought under the leadership of Jharkhand Mukti Morcha (JMM): Hemant Soren, Former Jharkhand CM. <a href="https://t.co/hClR9cVSgD">pic.twitter.com/hClR9cVSgD</a></p>— ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/970944118946852864?ref_src=twsrc^tfw">March 6, 2018</a></blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

Show Full Article
Print Article
Next Story
More Stories