హలో “రామ్” ప్రేమకోసమే

హలో “రామ్” ప్రేమకోసమే
x
Highlights

నిర్ణయం సినిమాలో వింటిమి, హలో గురు ప్రేమకోసమే అంటిమి, అదే పేరుగా రామ్ సినిమా వచ్చెను, సోమవారమే టీజరు విడుదల చేసెను. శ్రీ.కో. అప్పట్లో నిర్ణయం...

నిర్ణయం సినిమాలో వింటిమి,

హలో గురు ప్రేమకోసమే అంటిమి,

అదే పేరుగా రామ్ సినిమా వచ్చెను,

సోమవారమే టీజరు విడుదల చేసెను. శ్రీ.కో.


అప్పట్లో నిర్ణయం సినిమాలోని “‘హలో గురు ప్రేమకోసమే “ పాట గుర్తుందా మీకు, ఇప్పుడు ఎనర్జిటిక్ హీరో రామ్, మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ జంటగా అదే పేరుతో ఒక చిత్రం వస్తుంది. త్రినాథరావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కుడా ఈ చిత్రంలో ఒక పాత్ర పోషిస్తున్నాడట. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌‌కి మంచి టాక్ వచ్చింది. అలాగే, ఈ సోమవారం నాడు ‘హలో గురు ప్రేమకోసమే..’ సినెమా యొక్క టీజర్‌ను విడుదల చేసింది ఈ మూవీ టీం. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories