9 ఏళ్ల తర్వాత దొరికిన సోదరి ఆచూకీ, అంతలోనే విషాదం..

x
Highlights

తోడబుట్టిన అక్క కోసం తమ్ముడు తొమ్మిదేళ్లుగా పోరాడుతున్నాడు. తొమ్మిదేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన అక్క ఆచూకీ కోసం గాలిస్తున్నాడు. నల్గొండ జిల్లా...

తోడబుట్టిన అక్క కోసం తమ్ముడు తొమ్మిదేళ్లుగా పోరాడుతున్నాడు. తొమ్మిదేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన అక్క ఆచూకీ కోసం గాలిస్తున్నాడు. నల్గొండ జిల్లా మర్రిగూడ వాసి హనుమంతును పెళ్లి చేసుకున్నట్లు ఫేస్‌‌బుక్‌ ద్వారా తెలుసుకున్న తమ్ముడు ఉపేంద్రాచారి అక్క కోసం గ్రామానికి వెళ్లి ఎంక్వైరీ చేశాడు. అయితే భర్త చేతిలో అక్క అత్యంత కిరాతకంగా హత్యకు గురైందని తెలుసుకున్న ఉపేంద్రాచారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉపేంద్రాచారి ఫిర్యాదు మేరకు నిందితుడు హనుమంతును పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఇద్దరు పిల్లల్ని అమ్మేసి మరో యువతిని పెళ్లి చేసుకొన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

Show Full Article
Print Article
Next Story
More Stories