logo
ఆంధ్రప్రదేశ్

టీడీపీ శని మమ్మల్ని వదిలి కాంగ్రెస్‌ను పట్టింది

X
Highlights

నిజామాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో బీజేపీపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఎంపీ జీవీఎల్ కౌంటర్ ఇచ్చారు. ప్రజా తీర్పును...

నిజామాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో బీజేపీపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఎంపీ జీవీఎల్ కౌంటర్ ఇచ్చారు. ప్రజా తీర్పును అపహాస్యం చేస్తూ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లారో చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని కేసీఆర్‌ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తరువాతే ప్రచారం చేయాలంటూ సూచించారు. కుటుంబ పాలన సాగిస్తున్న కేసీఆర్‌‌కు తెలంగాణ ప్రజలే బుద్ధి చెబుతారని జీవీఎల్ అన్నారు. పోటీపడి అబద్దాలు చెబుతూ, అవినీతికి పాల్పడుతున్న తెలుగు రాష్ట్రాల సీఎంలకు త్వరలోనే గుణపాఠం చెబుతామన్నారు. తమ నుంచి టీడీపీ వెళ్లిపోవడంతో బీజేపీకి పట్టిన శని పోయిందన్న ఆయన ఇప్పుడు ఆ శని కాంగ్రెస్‌కు తగిలిందన్నారు.

Next Story