‘బాహుబలి’పై ఐఐఎం-ఎ విద్యార్థుల అధ్యయనం!

‘బాహుబలి’పై ఐఐఎం-ఎ విద్యార్థుల అధ్యయనం!
x
Highlights

ఇండియన్‌ ఫిల్మ్‌ హిస్టరీలో చరిత్ర సృష్టించి రికార్డు కలెక్షన్లతో దుమ్మురేపిన బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘బాహుబలి’కి మరో అరుదైన గౌరవం దక్కింది. బాహుబలి...

ఇండియన్‌ ఫిల్మ్‌ హిస్టరీలో చరిత్ర సృష్టించి రికార్డు కలెక్షన్లతో దుమ్మురేపిన బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘బాహుబలి’కి మరో అరుదైన గౌరవం దక్కింది. బాహుబలి సిరీస్‌లో వచ్చిన రెండు సినిమాలు అఖండ విజయం సాధించడంపై సునిశిత అధ్యయానికి ప్రతిష్టాత్మక అహ్మదాబాద్‌ ఐఐఎం సిద్ధమైంది.

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి మలిచిన అద్భుత దృశ్యకావ్యం బాహుబలి మూవీ ఇప్పటికీ వండర్లను క్రియేట్‌ చేస్తోంది. ఇండియన్‌ ఫిల్మ్‌ హిస్టరీలో చరిత్ర సృష్టించి కొత్త రికార్డులను నెలకొల్పిన ఈ మూవీ మరోసారి తెలుగోడి సత్తాను చాడటంతోపాటు అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. బాహుబలి బిగినింగ్‌ ది కన్‌క్లూజన్‌ ఇలా రెండు పార్టులుగా వచ్చిన ఈ మూవీ రికార్టులను షేక్‌ చేసింది. రాజమౌళి నాలుగేళ్లపాటు కష్టపడి తీసిన ఈ మూవీ ఇప్పుడు ఐఐఎం విద్యార్థులకు పాఠంగా మారనుంది. బాహుబలి సక్సెస్ సీక్రెట్‌ని విద్యార్థులకు వివరించాలని అహ్మదాబాద్ ఐఐఎం ప్రొఫెసర్లు నిర్ణయం తీసుకున్నారు. ఐఐఎం సెకండియర్‌‌ విద్యార్థులకు ఓ ప్రత్యేక కోర్సుగా ఇవ్వనున్నారు. బాహుబలి మూవీ ఎలా అఖండ విజయం సాధించిందో అధ్యయనం చేయనున్నారు.

రాజమౌళి మార్కెటింగ్‌ స్ట్రాటజీ కలెక్షన్ల విషయంలో బాహుబలిని లెజెండరీ మూవీగా నిలబెట్టింది. ఇన్ని స్పెషాలిటీస్‌ ఉన్నాయి కాబట్టే అహ్మదాబాద్‌ ఐఐఎం ప్రొఫెసర్లు బాహుబలిని సబ్జెక్ట్‌గా ఎంచుకున్నారు. బాహుబలి సీక్వెల్స్‌ నిర్మాణం, మార్కెటింగ్‌ మంత్ర, కలెక్షన్స్‌ మీద దృష్టి పెడుతున్నట్లు ఐఐఎం ప్రొఫెసర్లు చెప్పారు. ఈ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతోపాటు డిజిటల్‌ మార్కెట్‌ గురించి వివరించనున్నట్లు చెబుతున్నారు. బాహుబలిని ఎగ్జాంపుల్‌గా తీసుకుని సినీ ఇండస్ట్రీ గురించి అన్ని కోణాల్లో స్టూడెంట్స్‌కు పాఠాలు చెప్పనున్నారు. వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌సక్సెస్‌ సాధించిన బాహుబలి సినిమానే సరైన సబ్జెక్ట్‌ అనిపించిందని అందుకే ఈ మూవీని ఎంపిక చేశామంటున్నారు అహ్మదాబాద్‌ ఐఐఎం ప్రొఫెసర్లు. సినీ రంగానికి సంబంధించి వివిధ కోర్సులను ప్రవేశపెట్టిన తొలి ఆసియా బిజినెస్‌ స్కూల్‌ ఐఐఎం. అలాంటి ప్రతిష్టాత్మక అహ్మదాబాద్‌ ఐఐఎంలో బాహుబలి మూవీ కేస్‌‌ స్టడీగా మారడంతో తెలుగు వాళ్ల సత్తాను మరోసారి చాటినట్లయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories