సేంద్రియ విధానంలో జామ సాగు చేస్తున్న కృష్ణా జిల్లా రైతు...ఎకరానికి 5 టన్నుల దిగుబడి

x
Highlights

పంటల సాగు విధానం మారాలి అప్పుడే రైతు వ్యవసాయంలో రాణించగలుగుతాడు. అదే విషయాన్ని తెలుసుకున్న కృష్ణా జిల్లా రైతు, భవిష్యత్తులో ఆధునిక సాగు విధానంలో వచ్చే...

పంటల సాగు విధానం మారాలి అప్పుడే రైతు వ్యవసాయంలో రాణించగలుగుతాడు. అదే విషయాన్ని తెలుసుకున్న కృష్ణా జిల్లా రైతు, భవిష్యత్తులో ఆధునిక సాగు విధానంలో వచ్చే నష్టాన్ని ముందుగానే గుర్తించాడు. రసాయనాల సాగుకు దూరంగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ జామ సాగులో మంచి ఫలితాలను అందుకుంటున్నాడు. పండ్ల తోటల సాగులో మేటి అని అనిపించుకుంటూ లాభాల బాటలో దూసుకెళుతున్నాడు.అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

ప్రకృతిలో మనకు ఆరోగ్యకరమైన పండ్లు ఎన్నో ఉన్నాయి. కానీ నేటీ కాలంలో అధిక దిగుబడి కోసం క్రిమి సంహారక మందుల పిచికారీతో హైబ్రిడ్ రకాల సాగుతో మేలు కన్నా కీడు దిశగానే పండ్ల సాగు జరుగుతోంది. దీనికి ధీటైన సమాధానం చెప్పి ఆరోగ్యకరమైన పండ్లను ఉత్పత్తి చేస్తూ లాభాలబాటలో పయనిస్తున్నాడు కృష్ణా జిల్లా రైతు దాసరి శ్రీనివాసరావు.

విజయవాడకు చెందిన శ్రీనివాసరావు ముసునూరు మండలంలో 20 ఎకరాల పొలం ఉంది. అందులో సేంద్రియ విధానంలో జామ సాగు చేపట్టారు. భారతీయ ఉద్యానవన శాఖ బెంగళూరు వారి సలహా మేరకు అర్క కిరణ్‌ అనే జామ రకాన్ని సాగుకు ఎన్నుకున్నారు.

అర్క కిరణ్ ఐఐహెచ్‌ఆర్ రూపొందించిన హై ఈల్డింగ్ వెరైటీ. ఒక ఎకరాంలో ఏకంగా 2 వేల మొక్కలను వేసుకోవచ్చు. ఒక్కో కాయ బరువు 100 గ్రాముల నుంచి 250 గ్రాముల వరకు ఉంటుంది. కాయ లోపల ఫ్లెష్ గులాబీ రంగులో ఉంటుంది. ఈ జామ నుంచి జ్యూస్‌ తయారు చేసుకోవచ్చు. షుగర్ పేషెంట్స్ ఈ జామను తీసుకోవచ్చు.

ఎకరం జామ సాగుకు 2 లక్షల వరకు పెట్టుబడి అయ్యింది. మొదటి సంవత్సరం ఎకరానికి 5 టన్నుల పంట దిగుబడిని సాధించారు. పెట్టుబడితో సమానంగా ఎకరానికి 2 లక్షల రూపాయల లాభాన్ని ఆర్జిస్తున్నారు శ్రీనివాసరావు. పూర్తి సేంద్రియ విధానంలో ఉద్యాన శాఖ అధికారుల సూచనల మేరకు పంట సాగు చేస్తున్నాడు ఈ రైతు. వేప పిండి, పశువుల ఎరువు, వర్మీకంపోస్ట్‌ను వినియోగిస్తున్నారు. నాణ్యమైన జామ కాయలను ఉత్పత్తి చేస్తున్నారు.

పంటకు తరచుగా వేరు తెగులు సోకుతుండడంతో అధికారులు సూచన మేరకు వేపపిండి కషాయాన్ని పంటకు పిచికారీ చేశారు. మంచి ఫలితాన్ని పొందుతున్నాడు. విషపూరిత పండ్లును సాగు చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సేంద్రియ విధానంలో జామ సాగు చేయడంతో మంచి ఆదరణ పొందుతున్నారు ఈ రైతు. ఉద్యాన శాఖ అధికారలు సాగులో తమ సహకారాన్ని అందిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను ఆర్జిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు రైతు శ్రీనివాసరావు.

Show Full Article
Print Article
Next Story
More Stories