వైసీపీకి ఆ 8 మంది రాజీనామా చేస్తారా?

వైసీపీకి ఆ 8 మంది రాజీనామా చేస్తారా?
x
Highlights

నూజివీడు వైసీపీలో ముసలం పుట్టింది. నూజివీడు పురపాలకసంఘంలో పాలకపక్షానికి చెందిన వైసీపీ కౌన్సిలర్‌లు ఎనిమిది మంది తమ పదవికి, పార్టీ సభ్యత్వానికి బుధవారం...

నూజివీడు వైసీపీలో ముసలం పుట్టింది. నూజివీడు పురపాలకసంఘంలో పాలకపక్షానికి చెందిన వైసీపీ కౌన్సిలర్‌లు ఎనిమిది మంది తమ పదవికి, పార్టీ సభ్యత్వానికి బుధవారం రాజీనామాచేసే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. మున్సిపల్ ఛైర్మన్ సీటు ఒప్పందంపై వైసీపీలో విభేదాలు వేడెక్కాయి. మున్సిపల్ ఛైర్మన్ కు త్రివేణికి మూడేల్లు, రేవతికి రెండేళ్లు పదవీకాలం చేయాలని ఒప్పందం కుదిరింది. అయితే ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ప్రస్తుత ఛైర్మన్ రాజీనామా చేయకపోవడంతో ఎనిమిది మంది కౌన్సిలర్లు రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. దీంతో నూజివీడు వైసీపీలో కలకలం బయలుదేరింది. వైసీపీ నేతలు వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories