ఖరీదైన జీఎస్‌టీ ప్రచారమా?

ఖరీదైన జీఎస్‌టీ ప్రచారమా?
x
Highlights

పన్నుల విషయంలో గొప్ప మార్పుఅని, గొప్ప జీఎస్‌టీ ను అమల్లోకి తెచ్చామని, ప్రజలకు అవగాహన తీసుకొచ్చేందుకని, అక్షరాలా రూ. 132.38కోట్లు ఖర్చు పెట్టిరని, ...

పన్నుల విషయంలో గొప్ప మార్పుఅని,

గొప్ప జీఎస్‌టీ ను అమల్లోకి తెచ్చామని,

ప్రజలకు అవగాహన తీసుకొచ్చేందుకని,

అక్షరాలా రూ. 132.38కోట్లు ఖర్చు పెట్టిరని,

తెలిపెను వారి ఖరీదైన సమాధానం. శ్రీ.కో.

దేశ ఆర్థికవ్యవస్థ మరియు పన్నుల విషయంలో గొప్ప మార్పు అని గతేడాది జులై 1న కేంద్ర ప్రభుత్వం వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)ను ప్రతిష్ఠాత్మకంగా అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీని కింద దేశంలోని అన్ని రకాల వస్తువులు, సేవలపై నాలుగు శ్లాబుల్లో పన్నులను విధిస్తోంది. అయితే ఈ జీఎస్‌టీపై ప్రజలకు అవగాహన తీసుకొచ్చేందుకు ప్రభుత్వం పలు రకాలుగా ప్రకటనలు ఇచ్చింది. అక్షరాలా రూ. 132.38కోట్లు. ఈ మేరకు సమాచార చట్టం దరఖాస్తు ద్వారా వెల్లడైంది. జీఎస్‌టీ ప్రకటనలు, ప్రచారం కోసం కేంద్ర ప్రభుత్వం చేసిన ఖర్చెంతో చెప్పాలంటూ సహ చట్టం ద్వారా ఓ దరఖాస్తు దాఖలైంది. ఈ దరఖాస్తుకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జవాబిచ్చింది. ప్రింట్‌ మీడియాలో జీఎస్‌టీ ప్రకటనల కోసం రూ.126,93,97,121 ఖర్చు చేసినట్లు సమాచార, ప్రసార శాఖ తన సమాధానంలో పేర్కొంది. జీఎస్‌టీ ప్రచారం కోసం బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ను అంబాసిడర్‌గా నియమించింది. ఇక ఔట్‌డోర్‌ ప్రకటనలకు రూ.5,44,35,502 ఖర్చు చేసారట.

Show Full Article
Print Article
Next Story
More Stories