ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య కీలక చర్చలు.. నిర్ణయాలు ఇవే..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం మధ్య తాత్కాలిక సంధి కుదిరినట్లు తెలుస్తోంది. ఆర్‌బీఐ,...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం మధ్య తాత్కాలిక సంధి కుదిరినట్లు తెలుస్తోంది. ఆర్‌బీఐ, ప్రభుత్వం మధ్య నెలకొని ఉన్న విభేదాల నేపథ్యంలో బోర్డు సమావేశం కీలకంగా మారింది. మింట్ రోడ్‌లోని ఆర్‌బీఐ ప్రధాన కార్యాలయలంలో దాదాపు 9 గంటలపాటుగా సాగిన ఈ సమావేశంలో సంధి దిశగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. చిన్న, మధ్య స్థాయి కంపెనీలకు రుణ నిబంధనలు, బలహీన బ్యాంకులకు ఉండాల్సిన నిబంధనలు తదితర అంశాలపై చర్చలు జరిగాయని తెలుస్తోంది. ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, డిప్యూటీ గవర్నర్లు.. ప్రభుత్వ నామినీలైన ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్, ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్‌ల నుంచి ప్రశ్నలు వచ్చినట్లు సమాచారం.
అలాగే 25 కోట్ల వరకు ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రుణాల పునర్నిర్మాణానికి వీలు కల్పించే ఒక పథకాన్ని ఆర్‌బీఐ పరిశీలించనుంది. సీఆర్‌ఏఆర్‌ను 9% వద్దే ఉంచాలని బోర్డు నిర్ణయించింది. సమావేశానంతరం ఆర్‌బీఐ విడుదల చేసిన ప్రకటన ప్రకారం తొమ్మిదిన్నర లక్షల కోట్ల అదనపు మూలధనం అంశం పరిశీలనకు అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు బోర్డు అంగీకరించింది. ఈ కమిటీ ఆర్‌బీఐ వద్ద ఉండాల్సిన మూలధన నిధుల నిల్వల సంఖ్యను నిర్ణయిస్తుంది. మొత్తానికి బోర్డు సమావేశం సానుకూల వాతావరణంలో ముగిసింది. ఇక తదుపరి సమావేశం వచ్చే డిసెంబరు 14న జరిగే అవకాశముంది.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMTముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMT