Top
logo

శుభవార్త : ఏపీలో గూగుల్‌ ఎక్స్‌ సెంటర్‌

శుభవార్త : ఏపీలో గూగుల్‌ ఎక్స్‌ సెంటర్‌
X
Highlights

ఏపీలో గూగుల్‌ ఎక్స్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో ఏపీ ప్రభుత్వం, గూగుల్ ఎక్స్ కంపెనీ...

ఏపీలో గూగుల్‌ ఎక్స్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో ఏపీ ప్రభుత్వం, గూగుల్ ఎక్స్ కంపెనీ ఎంవోయూ చేసుకుంది. మంత్రి నారా లోకేష్‌ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. త్వరలో విశాఖలో గూగుల్ ఎక్స్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు కానుంది. ఫైబర్‌గ్రిడ్‌తో ఒప్పందంలో భాగంగా ఏపీ 13 జిల్లాలో 2 వేల ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్, లింక్స్ గూగుల్ ఎక్స్ ఏర్పాటు చేయనుంది. ఈ సరికొత్త టెక్నాలజీతో తక్కువ ధరకే గ్రామీణ ప్రాంతాలకు వేగవంతమైన బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ సౌకర్యం రానుందని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.

Next Story