logo
సినిమా

రివ్యూ: గూఢచారి

రివ్యూ: గూఢచారి
X
Highlights

చిత్రం: గూఢచారి నటీనటులు: అడివి శేష్‌, శోభిత ధూళిపాళ్ల, ప్రకాష్‌రాజ్‌, వెన్నెల కిషోర్‌, మధు శాలిని, రవి...

చిత్రం: గూఢచారి
నటీనటులు: అడివి శేష్‌, శోభిత ధూళిపాళ్ల, ప్రకాష్‌రాజ్‌, వెన్నెల కిషోర్‌, మధు శాలిని, రవి ప్రకాష్‌, సుప్రియ తదితరులు
సంగీతం: శ్రీ చరణ్‌ పాకాల
సినిమాటోగ్రఫీ: షానియల్‌ డియో
ఎడిటింగ్‌: గ్యారీ
కథ, రచన: అబ్బూరి రవి, అడివి శేష్‌
నిర్మాత: అభిషేక్‌ పిక్చర్స్‌
దర్శకత్వం: శశి కిరణ్‌ టిక్కా
బ్యానర్‌: అభిషేక్‌ పిక్చర్స్‌
విడుదల: 03-08-2018

కర్మ సినిమాతో నటుడిగా కెరీర్ మొదలుపెట్టిన అడివి శేషు.. క్షణం, అమీతుమీ చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్నాడు. వైవిధ్యభరితమైన కథలు ఎంచుకునే ఈ హీరో గూఢచారిగా మన ముందుకొచ్చాడు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై శశి కిరణ్ తిక్క డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కింది. అడివి శేషు ఈ సినిమాలో కేవలం హీరో మాత్రమే కాదు, కథ కూడా ఆయనదే. రాహుల్ పాకాల, శశి కిరణ్‌తో కలిసి స్క్రీన్‌ ప్లేలోనూ ఆయన భాగం పంచుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇది అడివి శేషు సినిమా. మరి ఇంత ఎఫర్ట్ పెట్టిన తీసిన ‘గూఢచారి’ ఆకట్టుకున్నాడా? యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ ; గోపి (అడివి శేష్‌) ‘రా’ అధికారి రఘువీర్‌ కొడుకు. గోపి చిన్నతనంలోనే సిక్కింలో జరిగిన ఓ ఆపరేషన్‌లో రఘువీర్‌ చనిపోతాడు. దీంతో రఘువీర్‌ స్నేహితుడు సత్య (ప్రకాష్ రాజ్‌), గోపికి ప్రాణ హాని ఉందని అతడి ఐడెంటిటీ మార్చి అర్జున్‌ కుమార్‌ పేరుతో పెంచి పెద్ద చేస్తాడు. అర్జున్‌ ఎన్ని ఉద్యోగాలు వచ్చిన రిజెక్ట్ చేస్తూ దేశ రక్షణలో తన తండ్రిలా భాగం కావాలనుకుంటాడు. సీబీఐ, ఐబీ, రా ఇలా అన్ని బ్యూరోలకు 174 అప్లికేషన్స్‌ పెట్టుకున్నా ఒక్కదానికీ రెస్పాన్స్‌ రాదు. ఫైనల్‌గా 175వ సారి తాను మాజీ ‘రా’ అధికారి రఘువీర్‌ కొడుకుని అని మెన్షన్‌ చేసి అప్లై చేస్తాడు. ఈ సారి అర్జున్‌కు కాల్‌ వస్తుంది. త్రినేత్ర అనే స్పెషల్ టీం కోసం అర్జున్‌ను సెలెక్ట్ చేస్తారు. అర్జున్‌ తో పాటు మరో ఐదుగురు అదే టీంలో ట్రైన్ అవుతారు. వారిలో బెస్ట్ అనిపించుకున్న అర్జున్‌.. త్రినేత్ర 11గా అపాయింట్‌ అవుతాడు.

కానీ అర్జున్‌ అపాయింట్‌ అయిన రోజే త్రినేత్ర సృష్టి కర్త ఆచారి మీద ఎటాక్‌ అవుతుంది. ఎటాక్‌లో ఆచారితో పాటు కొంత మంది ఆఫీసర్స్‌ కూడా చనిపోతారు. ఎటాక్ చేసిన వ్యక్తి అర్జున్‌ బైక్‌ మీద రావటం, ఆచారిని చంపిన తుపాకి మీద అర్జున్‌ వేలి ముద్రలు ఉండటంతో ప్రభుత్వం అర్జునే తీవ్రవాదులకు కోవర్ట్‌ గా మారాడని భావిస్తుంది. విషయం తెలుసుకున్న అర్జున్‌ తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకునేందుకు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. అసలు ఆచారి మీద ఎటాక్ చేసింది ఎవరు..? వాళ్లు అర్జున్‌ చేసినట్టుగా ఎందుకు సృష్టించారు..? అర్జున్‌ ఈ మిస్టరీని ఎలా చేదించాడు..? అన్నదే మిగతా కథ.

విశ్లేష‌ణ‌: జేమ్స్ బాండ్ సినిమాలంటే మ‌న‌కు గుర్తుకు వ‌చ్చేవి కృష్ణ న‌టించిన గూఢ‌చారి 116, చిరంజీవి గూడ‌చారి నెం.1 చిత్రాలే.. అలాంటి టైటిల్‌తో సినిమా రూపొందుతోందంటే క‌చ్చితంగా సినిమాపై అంచ‌నాలుంటాయ‌న‌డంలో ఏ సందేహం లేదు. సినిమా ఆ అంచ‌నాల‌కు ధీటుగా ఉండాలి. అడివి శేష్, శ‌శికిర‌ణ్ తిక్క అండ్ టీం ఫ‌స్ట్ సీన్ నుండి లాస్ట్ సీన్ వ‌ర‌కు గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్ష‌కుల‌కు క‌ట్టి పడేశారు. హీరో క్యారెక్ట‌ర్ ‘రా’లోకి వెళ్ల‌డం.. ఆ స‌న్నివేశాలు.. హీరో, హీరోయిన్ మ‌ధ్య ప్రేమ స‌న్నివేశాలు.. మ‌ధ్య మ‌ధ్య‌లో హీరోను ఎవ‌రో అబ్జ‌ర్వ్ చేయ‌డం.. ఇంట‌ర్వెల్ ముందు ప్లాన్ చేసి హీరోని ఇరికించ‌డం.. అన్ని ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. ఇక సెకండాఫ్‌లో హీరో త‌న‌పై జ‌రిగిన కుట్ర‌ను క్లియ‌ర్ చేసుకునే సంద‌ర్భంలో స‌మ‌స్య‌ల‌ను ఫేస్ చేయ‌డం.. వాటిని డీ కోడ్ చేస్తూ ముందుకెళ్ల‌డం అన్నీ సూప‌ర్బ్‌గా ఉన్నాయి. ఇక జగ‌పతిబాబు పాత్ర‌ను రివీల్ చేసిన తీరు.. ఆ పాత్ర‌ను డిజైన్ చేసిన తీరు అద్భుతంగా ఉంది.

శ్రీచ‌ర‌ణ్ పాకాల మంచి నేప‌థ్య సంగీతంతో స‌న్నివేశాల‌ను ఎన్‌హెన్స్ చేశారు. అలాగే శ‌నీల్ డియో కెమెరా వర్క్‌తో ప్ర‌తి స‌న్నివేశం చాలా రిచ్‌గా ఉంది. అడివి శేష్ ప‌డ్డ క‌ష్టం తెర‌పై క‌న‌ప‌డుతుంది. క‌థ‌, స్క్రీన్‌ప్లేలో భాగం అవ‌డ‌మే కాకుండా.. హీరోగా న‌టించిన తీరు మెప్పిస్తుంది. శోభితా దూళిపాళ పాత్ర ఫ‌స్టాఫ్‌కే ప‌రిమిత‌మైనా చ‌క్క‌గా ఉంది. 22 ఏళ్ల త‌ర్వాత న‌టించిన సుప్రియ యార్ల‌గ‌డ్డ మంచి పాత్ర‌లో న‌టించారు. అనీశ్ కూడా మంచి పాత్ర చేశారు. వెన్నెల‌కిశోర్ పాత్ర పంచ్‌ల‌తో కామెడీ పుట్టించే ప్ర‌య‌త్నం బావుంది. ముఖ్యంగా క‌థ‌లో ట్విస్టులు, ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌, క్లైమాక్స్ ఇలా అన్నీ.. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్ట‌కుంటాయి.

Next Story