‘హ్యాపీనెస్ట్‌’కు అనూహ్య స్పందన...తొలి అరగంటలోనే 700 ఫ్లాట్లు...

‘హ్యాపీనెస్ట్‌’కు అనూహ్య స్పందన...తొలి అరగంటలోనే 700 ఫ్లాట్లు...
x
Highlights

అమరావతిలో సీఆర్‌డీఏ నిర్వహించిన హ్యాపీ నెస్ట్‌కు భారీ స్పందన వచ్చింది. మొత్తం 900 ఫ్లాట్లున్న ఈ గృహనిర్మాణ సముదాయానికి రెండో సారి చేపట్టిన వేలం...

అమరావతిలో సీఆర్‌డీఏ నిర్వహించిన హ్యాపీ నెస్ట్‌కు భారీ స్పందన వచ్చింది. మొత్తం 900 ఫ్లాట్లున్న ఈ గృహనిర్మాణ సముదాయానికి రెండో సారి చేపట్టిన వేలం ప్రక్రియ కేవలం గంటలోపే ముగిసింది. దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున ఈ ఫ్లాట్లను బుక్‌ చేసుకున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఆన్‌లైన్‌ బుకింగ్‌లో తొలి అరగంటలోనే ఏకంగా 700 ఫ్లాట్లు బుక్‌ అయ్యాయి. ఫ్లాట్లు బుక్‌ చేసుకున్న వారికి సీఆర్డీఏ కమిషనర్‌ బుకింగ్‌ పత్రాన్ని కూడా అందజేశారు. వచ్చే 24 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేసి అప్పగిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ వారంలోనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories