వైద్య విద్యార్థులకు కేసీఆర్‌ గుడ్‌న్యూస్‌!

వైద్య విద్యార్థులకు కేసీఆర్‌ గుడ్‌న్యూస్‌!
x
Highlights

పీజీ పూర్తి చేసిన మెడికల్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. పీజీ పూర్తి చేసిన మెడికల్ విద్యార్థులు కచ్చితంగా ఏడాదిపాటు ప్రభుత్వ...

పీజీ పూర్తి చేసిన మెడికల్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. పీజీ పూర్తి చేసిన మెడికల్ విద్యార్థులు కచ్చితంగా ఏడాదిపాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేయాలనే నిబంధన తొలగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించి బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు సీఎం తెలిపారు. ఈ నిర్ణయం ఏడాది నుంచే అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది పీజీ పూర్తి చేసిన విద్యార్థులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేయకున్నా వారి విద్యార్హతలను రిజిస్టర్ చేయాలన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో చాలినంత సిబ్బందిని రెగ్యులర్ ప్రాతిపదికనే నియమిస్తున్నందున మెడికల్ విద్యార్థులతో పని చేయించాల్సిన అవసరం లేదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories