బస్సులో భారీగా బంగారం అపహరణ

బస్సులో భారీగా బంగారం అపహరణ
x
Highlights

తూర్పుగోదావరి జిల్లాలో సినీఫక్కీలో భారీ చోరీ జరిగింది. గండేపల్లి కరుణ్ కుమార్‌ హోటల్‌ దగ్గర నిలిచిఉన్న బస్సులో నుంచి ఏకంగా నాలుగున్నర కేజీల బంగారాన్ని...

తూర్పుగోదావరి జిల్లాలో సినీఫక్కీలో భారీ చోరీ జరిగింది. గండేపల్లి కరుణ్ కుమార్‌ హోటల్‌ దగ్గర నిలిచిఉన్న బస్సులో నుంచి ఏకంగా నాలుగున్నర కేజీల బంగారాన్ని చోరీ చేశారు. బంగారంతో బస్‌లో ప్రయాణిస్తున్న వ్యాపారులు టిఫిన్‌ కోసం దిగడంతో ఈ చోరీ జరిగింది.

వైజాగ్‌ నుంచి విజయవాడకు వెళ్తున్న బస్‌.. గండేపల్లి హోటల్‌ దగ్గర ఆగింది. అదే సమయంలో బస్సులో ఉన్న ప్రయాణీకులంతా టిఫిన్‌ కోసం దిగారు. బంగారం వెంట తెచ్చుకున్న వ్యాపారులు కూడా అల్పాహారం కోసం బస్సు దిగారు. అయితే బంగారం ఉన్న బ్యాగును బస్సులోనే ఉంచారు. అయితే అదే సమయంలో కారులో వచ్చిన దుండగులు.. బంగారం బ్యాగ్‌ను ఎత్తుకెళ్లిపోయారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దాపురం డీఎస్పీ రామారావు విచారణ చేపట్టారు. దోచుకెళ్లిన బంగారం విలువ కోటి 50 లక్షలుంటుందని అంచనా వేస్తున్నారు. ఇటు ఈ చోరీ తెలిసిన వారి పనే అని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories