రూ.1,313కే విమాన టికెట్‌..

nanireddy
Updated on: 24 Dec 2018 3:51 PM IST
రూ.1,313కే విమాన టికెట్‌..
X

దీపావళి పండగ, సంస్థ యానివర్సరీ సందర్బంగా బడ్జెట్‌ విమానయాన సంస్థ గోఎయిర్‌ విమాన ప్రయాణికులకు సరికొత్త ఆఫర్ ఇస్తోంది. అన్ని కలుపుకుని రూ.1,313 ధరకే విమాన టికెట్‌ను ఆఫర్‌ చేస్తోంది. ఈ డిస్కౌంట్ లలో మొత్తం 13 లక్షల సీట్లను ఆఫర్‌ చేస్తున్నామని గోఎయిర్‌ తెలిపింది. ఈ టికెట్లకు బుకింగ్స్‌ ఈ నెల 5 నుంచే అందుబాటులో ఉంచామని, ఈ నెల 18 వరకూ టికెట్లను బుక్‌ చేసుకోవచ్చని గోఎయిర్‌ సీఈఓ కార్నిలిస్‌ వీస్‌జివిక్‌ తెలిపారు. ఇప్పుడు బుక్‌ చేసుకున్న టికెట్లతో వచ్చే ఏడాది నవంబర్‌ 4వ తేదీలోపు దేశంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చని వివరించారు. కాగా గోఎయిర్ సంస్థ విమాన సర్వీస్‌లను ప్రారంభించి 13 సంవత్సరాలైన సందర్భంగా 13 లక్షల సీట్లను ఈ ఆఫర్‌లో అందిస్తోంది. ఇప్పటికే టిక్కెట్ల అమ్మకం మొదలు కావడంతో ఔత్సహికులు పోటీ పడుతున్నారు. మరోవైపు జెట్‌ఎయిర్‌వేస్‌ సంస్థ తన దివాలీ ఆఫర్‌ను ఈ నెల 11 వరకూ పొడిగించింది. ఈ ఆఫర్‌లో భాగంగా ఈ కంపెనీ దేశీ, అంతర్జాతీయ విమాన టికెట్లపై 30 శాతం డిస్కౌంట్‌ను ఇస్తోంది.

nanireddy

nanireddy

Next Story