రేప్ చేసి వీడియోతీసి, సోషల్ మీడియాలో పెట్టి..

రేప్ చేసి వీడియోతీసి, సోషల్ మీడియాలో పెట్టి..
x
Highlights

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో దారుణం జరిగింది. మార్కండేయ కాలనీకి చెందిన బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కట్టెల కోసం వెళ్లిన...

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో దారుణం జరిగింది. మార్కండేయ కాలనీకి చెందిన బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కట్టెల కోసం వెళ్లిన బాలికపై ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. కూల్ డ్రింక్‌లో ఆల్కహాల్ మిక్స్ చేసి తర్వాత అత్యాచారం చేశాడు. రేప్ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి వేరే వ్యక్తులకు వాట్సాప్ చేశాడు నగేష్. రేప్ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ వీడియోను మరికొందరు యువకులు డౌన్ లోడ్ చేసుకుని బాధితురాలిని బ్లాక్ మెయిల్ చేయడంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం.. పెద్దలకు చెప్పటంతో.. అక్కడికక్కడే పరిష్కరించే ప్రయత్నం చేశారు. యువకుడు నగేష్‌తో పెళ్లి చేస్తామని బాలికకు చెప్పారు. కానీ.. తమ సమస్యను 20 రోజులైనా పరిష్కరించకపోవడంతో బాధిత బాలిక పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories