ప్రేమించానన్నాడు.. పెళ్లి అంటే వద్దంటున్నాడు

nanireddy
Updated on: 24 Dec 2018 3:27 PM IST
ప్రేమించానన్నాడు.. పెళ్లి అంటే వద్దంటున్నాడు
X

మూడేళ్ళుగా ప్రేమిస్తున్నానని వెంటపడి.. చివరకు పెళ్లి చేసుకోమంటే నిరాకరిస్తున్నాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కర్నూల్ జిల్లా పత్తికొండలో జరిగింది. పత్తికొండకు చెందిన పవన్‌ చదువు పూర్తి చేసి హైదబాద్‌లో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన యువతి బీటెక్‌ చదివి ఇంటివద్దే ఉంటోంది. వీరిద్దరికి రైలు ప్రయాణంలో పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. మూడేళ్లుగా వీరి ప్రేమ కొనసాగుతోంది. అయితే ఇటీవల పెళ్లి చేసుకుందామని యువతి పవన్ వద్ద ప్రస్తావించడంతో అతను అంగీకరించకపోవడంతో పాటు కొద్దిరోజుల నుంచి కలవకుండా, ఫోన్‌లో స్పందించకుండా ఉన్నాడు. దాంతో తాడో పేడో తేల్చుకుందామని ఆ యువతి న పత్తికొండకు బంధువులతో కలసి వచ్చి ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.

nanireddy

nanireddy

Next Story