చేయి కొరికిందని అక్షరను చంపేసిన...11 యేళ్ల బాలిక

x
Highlights

హైదరాబాద్ జలవిహార్ పాప మృతి కేసులో సంచలన విషయం వెలుగుచూసింది. తన చేయి కొరికిందనే కోపంతో 11 యేళ్ల చిన్నారి.. యేడాదిన్నర అక్షరను.. నీటికుంటలోకి...

హైదరాబాద్ జలవిహార్ పాప మృతి కేసులో సంచలన విషయం వెలుగుచూసింది. తన చేయి కొరికిందనే కోపంతో 11 యేళ్ల చిన్నారి.. యేడాదిన్నర అక్షరను.. నీటికుంటలోకి తోసేసింది. 24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు.. బాలికను అదుపులోకి తీసుకుని.. జువైనల్ హోమ్‌కు తరలించారు.

హైదరాబాద్ జలవిహార్ దగ్గర యేడాదిన్నర పాప డెత్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఇంటిదగ్గరే ఉంటున్న 11 యేళ్ల బాలిక.. అక్షరను నీటికుంటలోకి తోసేసినట్లు పోలీసులు తెలిపారు. జలవిహార్‌లో పనిచేస్తున్న తల్లిదండ్రులు.. గురువారం పనికి వెళ్తూ.. తమ పాపను పక్కింట్లో వదిలి వెళ్లారు. అయితే అక్కడున్న మరికొందరు పిల్లలతో ఆడుకున్న పాప.. ఉదయం 11 గంటల తర్వాత నుంచి కనిపించకుండా పోయింది.

ఈ కేసులో తొలుత అక్షరను కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే సీసీ టీవీ ఫూటేజ్‌ను పరిశీలించిన పోలీసులు.. అక్షరతో పాటు మరో 8 మంది పిల్లలు ఒకే చోట ఆడుకుంటున్నట్లు గుర్తించారు. తర్వాత రెండో ఫూటేజ్‌లో 11 యేళ్ల చిన్నారి.. అక్షరను తీసుకెళ్తున్నట్లుగా కనిపించింది. దీనిపై విచారించిన పోలీసులు.. చిన్నారిని ప్రశ్నించగా.. తన చేయి కొరికిందనే అక్షరను నీటికుంటలోకి తోసేసినట్లు తెలిపింది. దీంతో చిన్నారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. జువైనల్ హోమ్‌కు తరలించారు.

విషయం తెలుసుకున్న.. అక్షర తల్లిదండ్రులు.. షాక్ కు గురయ్యారు. రోజూ తమ కూతురితో ఆడుకునే చిన్నారే.. అక్షరను నీటికుంటలో పడేసిందని తెలిసి కన్నీరుమున్నీరయ్యారు. తెలియనితనంతో బాలిక చేసిన తప్పు.. ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది.


Show Full Article
Print Article
Next Story
More Stories