తెలంగాణ ఇచ్చే విష‌యంలో కేసీఆర్‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేద‌ు

తెలంగాణ ఇచ్చే విష‌యంలో కేసీఆర్‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేద‌ు
x
Highlights

తెలంగాణ ఇచ్చే విష‌యంలో తాము ఎక్క‌డా కేసీఆర్‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత గులాం న‌బీ ఆజాద్ అన్నారు. తెలంగాణ ఏర్పాటులో...

తెలంగాణ ఇచ్చే విష‌యంలో తాము ఎక్క‌డా కేసీఆర్‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత గులాం న‌బీ ఆజాద్ అన్నారు. తెలంగాణ ఏర్పాటులో టీఆర్ఎస్ పాత్ర ఏమాత్రం లేద‌ని వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎంత‌గానో పోరాడార‌ని అనేక సార్లు అరెస్ట్ అయ్యార‌ని ఆజాద్ తెలిపారు. పార్టీ ప్ర‌జ‌ల డిమాండ్ మేర‌కే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింద‌ని ఆజాద్ వివ‌రించారు. లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌... ఈ నాలుగేళ్లలో ఖాళాగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులనే భర్తీ చేయలేకపోయారని, ఇంక కొత్త ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేస్తారని ఆజాద్‌ ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కువ అబద్ధాలు, తప్పుడు ప్రకటనలు ఇచ్చేది కేసీఆరేనని విమర్శించారు. విద్యార్థులు, యువతను కేసీఆర్ మోసం చేశారని, ముస్లింల రిజర్వేషన్ల అంశంలోనూ మోసానికి పాల్పడ్డారని ఆరోపించారు. తెలంగాణ ఇస్తే తెరాసను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని చెప్పి తమనూ మోసం చేశారని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories