సెలవు ఇవ్వకుంటే వారిపై చర్యలు తీసుకుంటాం : ఎన్నికల అధికారి

nanireddy
Updated on: 24 Dec 2018 4:22 PM IST
సెలవు ఇవ్వకుంటే వారిపై చర్యలు తీసుకుంటాం : ఎన్నికల అధికారి
X

తెలంగాణలో ఈనెల 7న ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్ లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు ప్రకటించింది ఎన్నికల కమిషన్. ఆరోజు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాలు అలాగే ప్రైవేట్‌ సంస్థలకు సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ఎం. దానకిశోర్‌ తెలిపారు.ఎన్నికల నేపథ్యంలో ఆరోజు తాము సెలవు ప్రకటించినప్పటికీ కొన్ని ప్రైవేట్‌ సంస్థలు, ఐటీ కంపెనీల ఉద్యోగులు తమకు ఫిర్యాదులు చేస్తున్నారని, ఆరోజు సెలవును ప్రకటించని సంస్థలపై ప్రజాప్రాతినిథ్య చట్టం 1951 సెక్షన్‌ 135(బీ)తోపాటు కార్మిక చట్టాలను అనుసరించి కఠిన చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

nanireddy

nanireddy

Next Story