వేధించ‌లేదు..ఆ అమ్మాయే మసాజ్‌ చేస్తానంది: గ‌జ‌ల్

వేధించ‌లేదు..ఆ అమ్మాయే మసాజ్‌ చేస్తానంది: గ‌జ‌ల్
x
Highlights

ప్రముఖ గజల్‌ గాయకుడు శ్రీనివాస్‌ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్‌ అయ్యాడు. పంజాగుట్టలోని ఓ వెబ్‌ రేడియోలో ప్రొగ్రామ్‌ హెడ్‌గా పని చేస్తున్న మహిళలను...

ప్రముఖ గజల్‌ గాయకుడు శ్రీనివాస్‌ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్‌ అయ్యాడు. పంజాగుట్టలోని ఓ వెబ్‌ రేడియోలో ప్రొగ్రామ్‌ హెడ్‌గా పని చేస్తున్న మహిళలను లైంగికంగా వేధించినట్టు గజల్‌ శ్రీనివాస్‌పై కేసు నమోదయ్యింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు గజల్‌ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఈ అరెస్ట్ పై గ‌జ‌ల్ స్పందించాడు. తాను మసాజ్ చేయించుకున్నానన్న ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నాడు. భుజానికి దెబ్బ త‌గిలింది. ఆ స‌మ‌యంలో ఆమె నాభుజానికి మందు రాసింద‌ని తెలిపారు. అంతేకాదు తాను మ‌హిళ‌ల్ని గౌర‌విస్తాన‌ని ఆ అమ్మాయిని తాను వేదించ‌లేద‌ని ఆత్మసాక్షిగా చెబుతునన్నారు. వేధిస్తున్నాడ‌ని ఫిర్యాదు చేసిన కుమారిని త‌న బిడ్డ‌లా చూసుకున్నాన‌ని లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ ఫిర్యాదు చేసిందంటే ఆశ్చర్యం కలిగిందని తెలిపాడు. ఇదిలా ఉంటే త‌న సంస్థ అయిన ఆలయ వాణి వెబ్ రేడియో ఆఫీసు నుంచి వీడియోలు తీసుకుపోయిందని కొందరు చెప్పారు. ఆ వీడియోల్లో ఏముందో కూడా తెలియదు. ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించ లేదు’ అని గజల్ శ్రీనివాస్ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories