ఈ గజల్ గలీజ్.. నగ్నంగా ఉండాలని మసాజ్‌ చేయాలంటూ వేధించేవాడని బాధితురాలు ఫిర్యాదు

x
Highlights

ప్రముఖ గజల్‌ గాయకుడు శ్రీనివాస్‌... లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్‌ అయ్యాడు. పంజాగుట్టలోని ఓ వెబ్‌ రేడియోలో ప్రొగ్రామ్‌ హెడ్‌గా పని చేస్తున్న మహిళలను...

ప్రముఖ గజల్‌ గాయకుడు శ్రీనివాస్‌... లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్‌ అయ్యాడు. పంజాగుట్టలోని ఓ వెబ్‌ రేడియోలో ప్రొగ్రామ్‌ హెడ్‌గా పని చేస్తున్న మహిళలను లైంగికంగా వేధించినట్టు గజల్‌ శ్రీనివాస్‌పై కేసు నమోదయ్యింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు గజల్‌ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు.

గజల్‌ శ్రీనివాస్‌ కుమారి అనే అమ్మాయిని వేధించడంతోనే అరెస్ట్ చేశామన్నారు పంజాగుట్ట ఏసీపీ విజయ్‌కుమార్‌. నగ్నంగా ఉండాలని మసాజ్‌ చేయాలంటూ వేధించేవాడని బాధితురాలు ఫిర్యాదు చేసిందని ఏసీపీ తెలిపారు. గజల్‌ శ్రీనివాస్‌ వేధింపులకు సంబంధించిన వీడియో సాక్ష్యాలు బాధితురాలు తమకు అందించినట్టు చెప్పారు.

పంజాగుట్టలో ఆలయవాణి పేరుతో గజల్‌ శ్రీనివాస్‌ వెబ్‌ రెడియో నిర్వహిస్తున్నారు. అందులో ప్రొగ్రామ్‌ హెడ్‌గా పని చేస్తున్న కుమారీ తనను లైంగికంగా వేధించారంటూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. గజల్‌ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు కేసు ద్యాప్తు చేస్తున్నారు. రేడియోజాకీగా కుమారి పనిచేస్తున్నారు. ప్రముఖ గాయకునిగా గజల్ శ్రీనివాస్ తెలుగు రాష్ట్రాల్లోనేగాక విదేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఆయన అరెస్టు వార్త సాహితీ లోకంలో కలకలం రేపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories