logo
ఆంధ్రప్రదేశ్

డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌

డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌
X
Highlights

ఏపీ డీఎస్సీ షెడ్యూల్‌‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం ఉదయం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి...

ఏపీ డీఎస్సీ షెడ్యూల్‌‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం ఉదయం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డీఎస్సీ కొంచెం ఆలస్యమైన విషయం వాస్తమేనని.. అయితే ఈసారి ఎక్కువ మందికి ప్రయోజనం కలిగేలా నిర్వహిస్తామని తెలిపారు. మొత్తం 7325 పోస్టులకు శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదలకానుంది. ఇందులో పాఠశాల విద్యాశాఖకు 4341, మోడల్‌ స్కూల్స్‌కు 909, మున్సిపల్‌ స్కూళ్లకు 1100, గిరిజన సంక్షేమ పాఠశాలకు 800, ఏపీఆర్‌ఈఐ సొసైటీ పాఠశాలలకు 175 పోస్టులు ఉంటాయి. కాగా.. ఈ 7325 పోస్టుల్లో 3666 ఎస్జీటీ, 1625 స్కూల్‌ అసిస్టెంట్‌, 452 లాంగ్వేజ్‌ పండిట్‌, 441 పీఈటీ, 556 టీజీటీ, 429 పీజీటీ, 77 ప్రిన్సిపాల్‌, 79 డ్రాయింగ్‌, డాన్స్‌ పోస్టులు ఉన్నాయి.

షెడ్యూల్‌ ఇలా..
* అక్టోబరు 26న నోటిఫికేషన్‌ విడుదల
* నవంబరు 1 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
* నవంబరు 29 నుంచి హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు
* నవంబరు 17న నుంచి ఆన్‌లైన్‌లో మాక్‌ టెస్ట్‌లు
* డిసెంబర్‌ 6, 10 తేదీల్లో స్కూలు అసిస్టెంట్‌(నాన్‌ లాంగ్వేజెస్‌) రాత పరీక్ష
* డిసెంబర్‌ 12, 13న పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ రాత పరీక్ష
* డిసెంబర్‌ 14, 26న టీచర్స్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌, ప్రిన్సిపల్స్‌ రాత పరీక్ష
* డిసెంబర్‌ 17 పీఈటీ, మ్యూజిట్‌, క్రాప్ట్‌ అండ్‌ ఆర్ట్స్‌, డ్రాయింగ్ రాత పరీక్ష

Next Story