దారుణం: 2 రోజులపాటు మైనర్‌ బాలికపై 14 మంది గ్యాంగ్‌రేప్

దారుణం: 2 రోజులపాటు మైనర్‌ బాలికపై 14 మంది గ్యాంగ్‌రేప్
x
Highlights

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక మండలం జానంపేట పాండురంగాపురం గ్రామానికి చెందిన 15 ఏళ్ళ బాలికపై 14 మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక మండలం జానంపేట పాండురంగాపురం గ్రామానికి చెందిన 15 ఏళ్ళ బాలికపై 14 మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. బాధితురాలిని అడవుల్లోకి తీసుకెళ్ళి రెండు రోజుల పాటు యువతిని 14మంది యువకులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు నిందితులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆనంపేట పాండురంగాపురం గ్రామానికి చెందిన బాలిక ఎనిమిదో తరగతి చదువుతుంది. కొన్ని కారణాలతో ఇటీవలనే స్కూల్ మానేసింది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా తల్లితో కలిసి కూలి పనులకు వెళ్తోంది. అయితే పుట్టిన రోజున సందర్భంగా స్నేహితులకు చాక్లెట్లు, బిస్కెట్లు పంచేందుకు ఆ బాలిక షాపు వద్దకు వెళ్ళింది. నిందితులు బాలికను కిడ్నాప్ చేసి అమరవరం తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఎదుళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకొచ్చింది. పెద్దల సమక్షంలో రాజీ ప్రయత్నాలు జరిగినట్లు కూడా తెలిసింది. యువకులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories